Site icon NTV Telugu

Auqib Nabi: వర్త్ వర్మ వర్త్.. 8వ స్థానంలో వచ్చి నబీ మెరుపు సెంచరీ, ఢిల్లీ క్యాపిటల్స్ ఫాన్స్ హ్యాపీ!

Auqib Nabi Century

Auqib Nabi Century

క్రికెట్‌లో అసాధ్యం కానిదంటూ ఏమీ లేదని అంటారు. మ్యాచ్‌లో ప్రతి బంతికి పరిస్థితులు మారుతూ ఉంటాయి. జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన విజయ్ హజారే ట్రోఫీ ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్‌లో కూడా ఇలాంటిదే జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్ల ఉత్సాహం పరిమితులను మించిపోయింది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఆకిబ్ నబీ హైదరాబాద్‌పై విరుచుకుపడ్డాడు. ఆకిబ్ నబీ ఫాస్ట్ బౌలర్ అయినా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఎనిమిదో స్థానంలో వచ్చి 82 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 114 పరుగులు చేశాడు. నబీ మెరుపు సెంచరీతో ఓటమి తప్పదనుకున్న జమ్ముకశ్మీర్‌.. హైదరాబాద్‌పై 3 వికెట్ల తేడాతో గెలిచింది. పీ

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ 9 వికెట్లకు 268 పరుగులు చేసింది. ఛేదనలో జమ్ముకశ్మీర్‌ 90 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఎనిమిదో స్థానంలో వచ్చిన అకిబ్‌ నబీ ఉహించని రీతిలో చెలరేగాడు. వన్షజ్‌ శర్మ (69 నాటౌట్‌)తో కలిసి జట్టును లక్ష్యం వైపు తీసుకెళ్లాడు. ఇద్దరు ఎనిమిదో వికెట్‌కు 182 పరుగులు జోడించడంతో జమ్ముకశ్మీర్‌ 47.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అంతకుముందు బౌలింగ్‌లో కూడా విధ్వంసం సృష్టించాడు. తన 10 ఓవర్ల కోటాలో 56 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. నబీ అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్‌తో హైదరాబాద్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.

Also Read: Abhishek Sharma: టీ20 ప్రపంచకప్‌కు ముందు టెన్షన్‌ పెడుతున్న అభిషేక్ శర్మ!

29 ఏళ్ల ఆకిబ్ నబీ తన అద్భుతమైన ఆటతీరుతో దేశీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2026 మినీ వేలంలో అతడిని రూ.8.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఢిల్లీ మాత్రమే కాదు నాలుగు జట్లు వేలంలో ఆకిబ్ కోసం పోటీ పడ్డాయి. ఢిల్లీతో పాటు రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ అతని కోసం ట్రై చేశాయి. ఆకిబ్ బేస్ ధర రూ.30 లక్షలు మాత్రమే. ఆకిబ్ నబీ తాజా ప్రదర్శనపై ఢిల్లీ క్యాపిటల్స్ ఫాన్స్ హ్యాపీగా ఉన్నారు. వర్త్ వర్మ వర్త్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version