NTV Telugu Site icon

Asian Games 2023 BCCI: బీసీసీఐ యూటర్న్.. ఏషియన్ గేమ్స్ 2023‌లో భారత క్రికెట్ జట్లు!

Bcci Asian Games 2023

Bcci Asian Games 2023

Team India Set For Asian Games Debut: ఏషియన్‌ గేమ్స్‌ 2023కు చైనా అతిధ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. హాంగ్‌జౌ నగరంలో సెప్టెంబర్ 23 నుంచి ఆసియా క్రీడలు జరుగనున్నాయి. ఈసారి ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను కూడా చేర్చారు. క్రికెట్‌కు ఏషియన్ గేమ్స్‌లో గతంలో కేవలం రెండుసార్లు మాత్రమే అవకాశం ఇచ్చారు. 2010, 2014 ఆసియా క్రీడలలో క్రికెట్‌ను భాగం చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆసియా క్రీడల్లో క్రికెట్‌ భాగం కాగా.. ఈసారి భారత్ పాల్గొనబోతోంది. 2010, 2014 ఆసియా క్రీడల్లో భారత క్రికెట్‌ జట్టు పాల్గొనలేదు.

ఏషియన్ గేమ్స్‌లో బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, శ్రీలంక క్రికెట్ జట్లు పాల్గొన్నా.. బీసీసీఐ మాత్రం తమ జట్లను ఆడించలేదు. బిజీ షెడ్యూల్ కారణంగా తమ జట్లు పాల్గొనలేవని తెలిపింది. ఈ ఏడాది కూడా ఆసియా కప్‌ 2023, వన్డే ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో ఈ టోర్నీలో భాగం కాలేమని గతంలో బీసీసీఐ పేర్కొంది. అయితే ఇప్పుడు యూటర్న్ (BCCI makes U-Turn on Asian Games 2023) తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఏషియన్ గేమ్స్‌కు భారత పురుష, మహిళ జట్లను పంపాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఆక్టోబర్‌లో భారత్‌ గడ్డపై వన్డే ప్రపంచకప్‌ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏషియన్ గేమ్స్‌కు ద్వితీయ శ్రేణి పురుషుల జట్టును పంపనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు సీనియర్‌ మహిళల జట్టే అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. జూన్ 30 లోపు భారత ఒలింపిక్ సంఘానికి ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ పంపనున్నట్లు సమాచారం. ఆసియా క్రీడల్లో క్రికెట్‌ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ఇదే నిజమయితే దాయాదులు భారత్‌-పాకిస్తాన్‌ జట్లు మరోసారి తలపడే అవకాశం ఉంది.

Also Read: Curry Leaves Water Benefits: కరివేపాకు నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!