NTV Telugu Site icon

Legends League Cricket: గంభీర్ సేనను ఓడించిన పాక్ మాజీ కెప్టెన్ జట్టు

Llc

Llc

లెజెండ్స్ లీగ్ క్రికెట్ దోహా వేదికగా (LLC)జరుగుతుంది. లీగ్ ను గౌతం గంజీర్ సారథ్యంలోని ఇండియా మహారాజాస్ జట్టు ఓటమితో ఆరంభించింది. పాకిస్తాన్ మజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిద్ సారథ్యంలోని ఆసియా లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా మహారాజాస్ కు ఓటమి తప్పలేదు. ఉత్కంఠంగా జరిగినా ఈ మ్యాచ్ లో ఆసియా లయన్స్ జట్టు 9 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్ .. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆ జట్టులో పాక్ మాజీ సారథి మిస్బా ఉల్ హక్ (50 బంతుల్లో 73, 2 ఫోర్లు, 4 సిక్సర్లు)కు తోడుగా శ్రీలంక మాజీ ఆటగాడు ఉపుల్ తరంగ(40) రాణించారు.

Aslo Read : Liquor Policy Case: కవితపై ఈడీ ప్రశ్నల వర్షం.. ఢిల్లీలో పరిణామాలపై కేసీఆర్ ఆరా

దిల్షాన్(5), అస్గర్ ఆఫ్గాన్ (1), అఫ్రిది (12), తిషారా పెరీరా (5), అబ్దుల్ రజాక్ (60) లు విఫలమయ్యారు. ఇండియా మహారాజాస్ బౌలర్లలో అవానా, స్టువర్ట్ బిన్నీలు తలా రెండు వికెట్లు తీయగా ఇర్ఫాన్ పఠాన్, అశోక్ దిండాలు తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేధనలో ఇండియా మహారాజాస్.. ఓపెనర్ రాబిన్ ఊతప్ప(0) వికెట్ ను త్వరగానే కోల్పోయింది. కానీ కెప్టెన్ గౌతం గంభీర్ (39 బంతుల్లో 54, 7ఫోర్లు ), మురళీ విజయ్ (25) రెండో వికెట్ కు 50 పరుగులు జోడించారు. విజయ్ ను దిల్షాన్ ఔట్ చేయంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన సురేశ్ రైనా విఫలమయ్యాడు. మహ్మద్ కైఫ్ (22) ఫర్వాలేదనిపించగా యూసప్ పఠాన్ (14), స్టువర్ట్ బిన్నీ (8)లు నిరాశపరిచారు.

Aslo Read : Pallavi Case: మా అమ్మాయిని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు.. పల్లవి పేరెంట్స్

చివర్లో ఇర్ఫాన్ పఠాన్ (19) ధాటిగా ఆడిగా పాకిస్తాన్ మాజీ బౌలర్ సోహైల్ తన్వీర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడమే గాక మూడు వికెట్లు తీయడంతో ఇండియా మహారాజాస్ కు షాకులిచ్చాడు. 19వ ఓవర్లో తన్వీర్.. తొలి బంతికి బిన్నీతో పాటు చివరి బంతికి ఇర్ఫాన్ పఠాన్ ను ఔట్ చేసి ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 156 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా 9 పరుగుల తేడాతో ఆసియా లయన్స్ విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్ లో రాణించిన మిస్భా ఉల్ హక్ కు ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ లీగ్ లో నేడు రాత్రి 8 గంటలకు ఇండియా మహారాజాస్ జట్టు, వరల్డ్ జెయింట్స్ తో పోటీ పడనుంది.

Aslo Read : Gold Smuggling : రైల్వేస్టేషన్లలో రూ.5.53 కోట్ల విలువైన బంగారం పట్టివేత