IND vs PAK: ఆసియా కప్ కోసం భారత జట్టు తన స్క్వాడ్‌ను నిన్న ( ఆగస్టు 19న) ప్రకటించింది. పాకిస్తాన్ కూడా ఇప్పటికే జట్టును వెల్లడించింది. అయితే, ఇండియా – పాక్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనేది ప్రస్తుతం అభిమానులకు అనుమానంగా ఉంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశంతో క్రికెట్ సంబంధాలనూ తెంచుకోవాలనే డిమాండ్లు భారీగా వస్తున్నాయి. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో పాక్‌తో మ్యాచ్ ను రద్దు చేసుకుంది. ఇప్పుడు ఆసియా కప్‌లో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారిపోయింది. ఇందులో ఎలాంటి డౌట్స్ వద్దని.. కేంద్ర సర్కార్ ఏం చెబితే దానిని బీసీసీఐ, టీమిండియా ఫాలో అవుతుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తెలిపారు. ఇలాంటప్పుడు ఆటగాళ్లపై ఎవరూ విమర్శలు చేయొద్దని సూచించారు.
Read Also: Delhi: ఢిల్లీ స్కూళ్లకు మరోసారి బాంబ్ బెదిరింపులు.. పోలీసులు తనిఖీలు
అయితే, పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై భారత సర్కార్ నిర్ణయం తీసుకుంటే.. దానిని అందరూ అనుసరించాల్సిందేనని సునీల్ గావస్కర్ తెలిపారు. ఇందులో ప్లేయర్స్ ను మాత్రం తిట్టడం మంచిది కాదన్నారు. వెంటనే కొందరు ప్లేయర్లపై కామెంట్లు చేయడానికి రెడీ అయిపోతారని పేర్కొన్నాడు. కానీ, ఇక్కడ ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి., ప్లేయర్స్ బీసీసీఐతో సెంట్రల్ కాంట్రాక్ట్ చేసుకుని ఉంటారు. కాగా, బీసీసీఐ మాత్రం కేంద్రం ఆదేశాలను పాటిస్తుంది అని వెల్లడించారు. కాబట్టి, ఇదంతా భారత ప్రభుత్వంపై ఆధారపడింది. ఈ విషయంలో ఆటగాళ్లు ఏం చేయలేరు.. ఇప్పుడు ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించారు.. ‘మీరు వెళ్లి ఆడండి’ అని కేంద్రం చెబితే పాక్ తో కూడా ఆడాల్సిందే.. అలాకాకుండా ‘వద్దు మీరు ఆడేందుకు పర్మిషన్ ఇవ్వం’ అని చెబితే.. దానికి తగినట్టుగానే బీసీసీఐ ముందుకు నడుస్తుంది.. కాబట్టి, భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే బీసీసీఐ దాని ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని గావస్కర్ వెల్లడించారు.
