Site icon NTV Telugu

Shoaib Akhtar: హ్యాట్స్ ఆఫ్ టూ ఇండియా.. క్రికెట్ను రాజకీయంగా చూడకండి.. షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Akthar

Akthar

Shoaib Akhtar: ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌పై మరోసారి భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా బాయ్ కాట్ ఆసియాకప్, బాయ్ కాట్ ఇండియా- పాక్ మ్యాచ్ పిలుపులు వచ్చినప్పటికీ, టీమిండియా మైదానంలో దిగి కేవలం 15.5 ఓవర్లలోనే 128 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది. అయితే, మ్యాచ్ అనంతరం జరిగిన సన్నివేశాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సూర్యకుమార్ యాదవ్ సేన గెలిచిన వెంటనే నేరుగా డ్రెస్సింగ్‌రూమ్‌కి వెళ్లిపోయింది. పాకిస్థాన్ ఆటగాళ్లు హ్యాండ్‌షేక్ కోసం స్టేడియంలో ఎదురు చూస్తున్నప్పటికీ.. భారత ఆటగాళ్లు వారిని పట్టించుకోకుండా నేరుగా వెనుదిరిగారు.

Read Also: Medha School: ఈరోజు పరీక్షలు అంటూ మెసేజ్.. మేధా స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన..

ఇక, ఈ సంఘటనపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేను షాక్‌లోనూ, నిరాశలోనూ ఉన్నాను.. ఏం చెప్పాలో తెలియడం లేదు.. హ్యాట్స్ ఆఫ్ టూ ఇండియా.. కానీ, క్రికెట్ మ్యాచ్‌ను రాజకీయ రంగులో చూడకండి అని పిలుపునిచ్చారు. మేము మీ గురించి మంచి మాటలే మాట్లాడాం.. హ్యాండ్‌షేక్‌పై మేము చాలా విషయాలు చెప్పగలం.. గొడవలు ఇంట్లో కూడా జరుగుతాయి.. కాబట్టి, పహల్గామ్ దాడుల గురించి మర్చిపోండి, పాక్ తో కలిసి ముందుకు సాగండి అన్నారు. ఇది గేమ్, ఇతర జట్ల ఆటగాళ్లతో చేతులు కలపండి, మీ గ్రేస్ చూపించండి అని అఖ్తర్ వ్యాఖ్యానించారు.

Exit mobile version