టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఆసియాకప్ 2023లో భాగంగా భారత్-నేపాల్ మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ అభిమానులకు గంభీర్ మిడిల్ ఫింగర్ ను చూపించాడు. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో మైదానం నుంచి గంభీర్ వెళ్లిపోతున్నప్పుడు ఆయనను చూసి అభిమానులు కోహ్లీ.. కోహ్లీ.. అంటూ గట్టిగా అరిచారు.. ఈ స్లోగన్స్‌తో కోపానికి గురైన గంభీర్.. కోహ్లీ అభిమానుల వైపు మిడిల్ ఫింగర్ చూపిస్తూ.. అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కోహ్లీ ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ ప్రేమికులు గంభీర్ తీరును తప్పుబడుతున్నారు.
Read Also: Harihara Veeramallu : మూవీ రిలీజ్ పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన నిర్మాత..
ఓ మాజీ క్రికెటర్‌గా.. పార్లమెంట్ మెంబర్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ ఇలా దిగజారి ప్రవర్తించడం సరికాదని సదరు క్రికెటర్లు మండిపడుతున్నారు. కోహ్లీపై కోపం ఉంటే ఇలా అభిమానులపై చూపించడం మంచిది కాదని సూచిస్తున్నారు. ఫ్యాన్స్ హద్దులు ధాటితే.. మాజీ క్రికెటర్‌గా హుందాగా ప్రవర్తించాలని మాజీ క్రికెటర్లు కామెంట్ చేస్తున్నారు. ఇక, ఆసియాకప్ 2023 టోర్నీకి గౌతమ్ గంభీర్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్-నేపాల్ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. ఆ టైంలో మైదానంలోకి వెళ్లిన గంభీర్.. మైదాన పరిస్థితులని వివరించి తిరుగు ముఖం పట్టే సమయంలో ఈ ఘటన జరిగింది. వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ పున:ప్రారంభమవ్వగా.. నేపాల్ ఆలౌట్ దిశగా కొనసాగుతోంది.
Read Also: Kerala: మద్యానికి బానిసై ముగ్గురు కూతుళ్ల గొంతు కోసిన తండ్రి
పాకిస్థాన్‌తో రద్దయిన తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఔటైన తీరును గంభీర్ తప్పుబట్టాడు. చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నాడని ఆయన విమర్శించాడు. ఈ కామెంట్స్ నేపథ్యంలోనే గంభీర్ కనిపించగానే విరాట్ అభిమానులు కోహ్లీ కోహ్లీ అంటూ స్లోగన్స్ చేశారు. ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా కూడా ఈ ఇద్దరి మధ్య మైదానంలోనే గొడవ జరిగింది.
— Out Of Context Cricket (@OutofConCricket) September 4, 2023