Site icon NTV Telugu

IND vs PAK: పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్‌ ఆడేది కష్టమే?.. బీసీసీఐ రియాక్షన్ ఇదే!

Bcci

Bcci

IND vs PAK: మరో మూడు రోజుల్లో యూఏఈ వేదికగా ఆసియా కప్‌- 2025 జరగనుంది. సెప్టెంబర్‌ 9వ తేదీన మొదటి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్, హాంకాంగ్‌ పోటీ పడనున్నాయి. ఇక, టీమిండియా తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 10న యూఏఈతో తలపడబోతుంది. అయితే, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత జట్టుకు మ్యాచ్‌ సెప్టెంబర్‌ 14వ తేదీన ఉంది. ఇక, పాక్ కి చెందిన ఉగ్రవాదులు ఏప్రిల్‌ 22న పహల్గాంలో దాడి చేసి 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారు. ఈ నేపథ్యంలో దాయాదితో ఏ విధమైన క్రికెట్‌ సంబంధాలు కొనసాగించొద్దనే వాదనలు సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్, క్రికెట్ లవర్స్, మాజీల నుంచి వినిపిస్తుంది. దీంతో ఆసియా కప్‌లో భారత్- పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.

Read Also: Mirai : మిరాయ్ లో అదే హైలెట్ సీన్ : మంచు మనోజ్

అలాగే, భారత అథ్లెట్లు, పాక్ అథ్లెట్లతో క్రీడా పోటీల్లో పోటీ పడే విషయంలో కొత్త మార్గదర్శకాలను కేంద్రం ఆగస్టులో రిలీజ్ చేసింది. వీటి ప్రకారం.. టీమిండియా శత్రుదేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌లకు దూరంగా ఉండాల్సిందే.. కానీ, మల్టీ నేషనల్‌ ఈవెంట్లలో మాత్రం పాల్గొంటుందని పేర్కొనింది. ఈ విషయంపై తాజాగా, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రకటనతో ఓ క్లారిటీ వచ్చింది. అయితే, భారత ప్రభుత్వం ఆదేశాలను బీసీసీఐ తప్పనిసరిగా పాటిస్తుంది.. మల్టీనేషనల్‌, ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్లలో పాల్గొనే అంశంపై స్పష్టంగా తెలిపింది. ఇలాంటి వేదికలపై.. భారత్‌తో స్నేహపూర్వకంగా లేని దేశాలతో ఆడటంపై కేంద్రం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు.. కాబట్టి భారత జట్టు మల్టీనేషనల్‌ టోర్నీల్లో అన్ని మ్యాచ్‌లు ఆడుతుందన్నారు. ఇక, ఆసియా కప్.. ఆసియా ఖండంలోని దేశాలు పాల్గొనే మల్టీనేషనల్‌ టోర్నమెంట్.. మనం ఇందులో తప్పకుండా పాల్గొనాల్సిందే అని సైకియా తెలిపారు. అలాగే, ఏదైనా ఐసీసీ టోర్నమెంట్‌లో, భారత్‌తో మంచి సంబంధాలు లేని దేశం పాల్గొన్నప్పటికీ, వారితో మనం ఆడతాం.. కానీ, ఆయా జట్లతో ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడబోమని సైకియా చెప్పుకొచ్చారు.

Read Also: Vizag: ఇన్‌స్టా‌గ్రామ్‌లో యువతి పోస్ట్ చేసిన ఫోటో మార్పింగ్ చేసిన యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే…

* ఆసియా కప్‌ గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు

9 సెప్టెంబర్‌: అఫ్గానిస్థాన్‌ vs హాంకాంగ్‌

10 సెప్టెంబర్‌: భారత్‌ vs యూఏఈ

11 సెప్టెంబర్‌: బంగ్లాదేశ్‌ vs హాంకాంగ్‌

12 సెప్టెంబర్‌: పాకిస్థాన్‌ vs ఒమన్‌

13 సెప్టెంబర్‌: బంగ్లాదేశ్‌ vs శ్రీలంక

14 సెప్టెంబర్‌: భారత్‌ vs పాకిస్థాన్‌

15 సెప్టెంబర్‌: శ్రీలంక vs హాంకాంగ్‌

16 సెప్టెంబర్‌: బంగ్లాదేశ్‌ vs అఫ్గానిస్థాన్‌

17 సెప్టెంబర్‌: పాకిస్థాన్‌ vs యూఏఈ

18 సెప్టెంబర్‌: శ్రీలంక vs అఫ్గానిస్థాన్‌

19 సెప్టెంబర్‌: భారత్‌ vs ఒమన్‌

* సూపర్‌ 4 మ్యాచ్‌లు

20 సెప్టెంబర్‌: గ్రూప్‌ బి క్వాలిఫయర్‌ 1 vs గ్రూప్‌ బి క్వాలిఫయర్‌ 2

21 సెప్టెంబర్‌: గ్రూప్‌ ఏ క్వాలిఫయర్‌ 1 vs గ్రూప్‌ ఏ క్వాలిఫయర్‌ 2

23 సెప్టెంబర్‌: గ్రూప్‌ ఏ క్వాలిఫయర్‌ 1 vs గ్రూప్‌ బి క్వాలిఫయర్‌ 2

24 సెప్టెంబర్‌: గ్రూప్‌ బి క్వాలిఫయర్‌ 1 vs గ్రూప్‌ ఏ క్వాలిఫయర్‌ 2

25 సెప్టెంబర్‌: గ్రూప్‌ ఏ క్వాలిఫయర్‌ 2 vs గ్రూప్‌ బి క్వాలిఫయర్‌ 2

26 సెప్టెంబర్‌: గ్రూప్‌ ఏ క్వాలిఫయర్‌ 1 vs గ్రూప్‌ బి క్వాలిఫయర్‌ 1

* ఫైనల్‌ మ్యాచ్‌

28 సెప్టెంబర్‌: ఫైనల్‌

Exit mobile version