వివిధ కారణాల వల్ల నాలుగేళ్లుగా నిర్వహించలేకపోయిన ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను తిరిగి ఈ ఏడాది ప్రారంభించాలని ఆసియా కప్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి ఆసియా కప్‌ను నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆసియా కప్‌ను నిర్వహిస్తుండటంతో ఈసారి టీ20 ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుంది.
ఆసియా కప్‌లో టీమిండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్ జట్లతో పాటు మరో టీమ్ కూడా పాల్గొననుంది. ఇప్పటివరకు 14 సార్లు ఆసియా కప్ నిర్వహించగా టీమిండియా ఏడు సార్లు గెలిచింది. శ్రీలంక ఐదు సార్లు, పాకిస్థాన్ రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఆగస్టు 20 నుంచి క్వాలిఫైయర్స్ మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్ టోర్నీ జరుగుతుంది. 2021 జూన్‌లోనే ఆసియాకప్ నిర్వహించాలని భావించగా… కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.
