భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో అశ్విన్ ఓ అరుదైన రికార్డును సమం చేసాడు. అయితే ఈరోజు కివీస్ రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లను పడగొట్టిన అశ్విన్… ఈ 2021 లో 50 టెస్ట్ వికెట్లు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. అలాగే అశ్విన్ కెరియర్ లో ఇది నాలుగోవసారి. ఇక ఈ మూడు వికెట్ల తో భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో అత్యధిక వికెట్లు తీసిన ఆల్ రౌండ్ గ్రేట్ రిచర్డ్ హ్యాడ్లీ రికార్డు ను సమం చేసాడు. హ్యాడ్లీ మొత్తం 24 ఇన్నింగ్స్ లలో 65 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ కేవలం 17 ఇన్నింగ్స్ లలోనే ఈ రికార్డును సమం చేసాడు. అయితే ప్రస్తుతం కివీస్ రెండో ఇన్నింగ్స్ లో 140 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. కాబట్టి రేపు జరగనున్న మ్యాచ్ లో అశ్విన్ ఒక్క వికెట్ తీసిన హ్యాడ్లీ రికార్డు ను బ్రేక్ చేస్తాడు. చూడాలి మరి రేపటి మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది.