Site icon NTV Telugu

Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్‌ని కరిచిన కుక్క.. వీడియో వైరల్

Arjun Tendulkar Dog Bite

Arjun Tendulkar Dog Bite

Arjun Tendulkar Bitten By Dog: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఈ ఐపీఎల్ సీజన్‌లో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే! కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఇతగాడు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లో తొలి వికెట్ పడగొట్టాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడిన అర్జున్.. 92 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇప్పుడు ప్లేఆఫ్స్ రేసులో భాగంగా ముంబై జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడేందుకు సిద్ధమవుతుండగా.. ప్రాక్టీస్ సందర్భంగా అర్జున్ లక్నో ఆటగాళ్లను కలిశాడు. ఈ సందర్భంగా అతడో తోటి ఆటగాళ్లతో ముచ్చటిస్తూ.. తనకు కుక్క కరిచిందన్న విషయాన్ని రివీల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని లక్నో సూపర్ జెయింట్స్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ముంబై నుంచి దోస్త్ వచ్చాడు అంటూ దానికి క్యాప్షన్ పెట్టింది.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌ను పబ్లిక్‌లో ఉరితీయాలి.. ప్రతిపక్ష నేత సంచలన వ్యాఖ్యలు

ఆ వీడియోలో తొలుత యుధ్వీర్ సింగ్‌తో అర్జున్ ముచ్చటించాడు. ఆలింగనం చేసుకున్న తర్వాత ‘ఎలా ఉన్నావ్? అంతా ఓకేనా?’ అని యుధ్వీర్ ప్రశ్నించగా.. అందుకు ‘కుక్క కరిచింది’ అంటూ బదులిచ్చాడు. ‘అవునా! ఎప్పుడు’ అని యుధ్వీర్ తిరిగి అడగ్గా.. ‘నిన్ననే’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత మొహ్సిన్ ఖాన్‌తోనూ ముచ్చటించాడు కానీ.. ఇక్కడ తనకు కుక్క కరిచిందని అర్జున్ చెప్పిన మాటే హాట్ టాపిక్‌గా మారింది. నెట్టింట్లో అందరూ దాని గురించే చర్చించుకుంటున్నారు. ‘జాగ్రత్తగా ఉండొచ్చు కదా అర్జున్’ అంటూ కొందరు సూచనలు ఇస్తుంటే, ఇది కూడా ఓ వార్తేనా? అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఎంతైనా సచిన్ తనయుడు కదా.. ఏం చేసినా హైలైట్ అవ్వాల్సిందే! కాగా.. ప్రస్తుతం ముంబై కీలక మ్యాచ్‌లు ఆడుతోంది కాబట్టి, అర్జున్‌కి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశాలు లేవు.

Anasuya Bharadwaj: ఏంటి ఆంటీ కుర్రాళ్లను ఇంతలా రెచ్చగొడుతున్నావ్‌..

Exit mobile version