Site icon NTV Telugu

Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. ఎమోషనల్ పోస్టు షేర్ చేసిన అనుష్క శర్మ

Va

Va

Virat Kohli Retirement: టీమిండియా స్టార్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్ బై చెప్పాడు. ఇక, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడాన్ని స్వాగతిస్తూ అతని భార్య అనుష్క శర్మ ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్టు పెట్టింది.. ఆ పోస్టులో.. ‘అందరూ రికార్డులు, మైలురాళ్ల గురించే మాట్లాడతారు.. నాకు మాత్రం నువ్వు దాచుకున్న కన్నీళ్లు.. బయటకు తెలియకుండా నీతో నువ్వు చేసిన యుద్ధాలు గుర్తిండి పోతాయని పేర్కొనింది. ఇక, టెస్టు ఫార్మాట్‌పై నీవు చూపిన ప్రేమను జీవితాంతం గుర్తుంచుకుంటాను అని వెల్లడించింది.

Read Also: Virat Kohli: వరల్డ్‌ క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్.. విరాట్‌ కోహ్లీపై ప్రశంసలు..

ఇక, ప్రతి టెస్టు సిరీస్ తర్వాత నువ్వు (విరాట్ కోహ్లీ) ఎంతో గొప్పగా తిరిగి వచ్చే వాడివి అని అనుష్క శర్మ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. నువ్వు ఎదిగిన విధానాన్ని పక్కన ఉండి చూడటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా నేను అని తెలిపింది. ఏదో ఒక రోజు టెస్టుల నుంచి రిటైర్ అవుతావని తెలుసు.. కానీ, ఇంత తొందరగా అని నేను ఎప్పుడు అనుకోలేదు అని పేర్కొనింది. అయితే, నువ్వు ఎల్లప్పుడూ నీ మనసు చెప్పిన ప్రకారమే తుది నిర్ణయం తీసుకుంటావు.. ఆటలో ప్రతిదీ సాధించావు.. వీడ్కోలు చెప్పడానికి నీవు అర్హుడివని భావిస్తున్నా అని అనుష్క శర్మ ఎమోషనల్ పోస్టు షేర్ చేసింది.

Exit mobile version