NTV Telugu Site icon

Anushka Sharma: భర్తకు ధైర్యం చెబుతున్న అనుష్క శర్మ.. నెట్టింట వైరల్ అవుతున్న పిక్..

Kohli (2)

Kohli (2)

క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ పోటీల్లో టీమ్ ఇండియా ఓటమిని చవి చూసింది.. ఈ విషయాన్ని చాలా మందికి మింగుడు పడటం లేదు.. ప్రపంచ టోర్నీలో అన్ని మ్యాచ్ లలో భారత జట్టు బాగా ఆడినప్పటికీ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది.. మ్యాచ్ ఓడిన తర్వాత టీమ్ అందరు ఎమోషనల్ అయ్యారు.. కోహ్లీ బాధపడుతుంటే అతని భార్య అనుష్క శర్మ అతన్ని ఓదారుస్తూ ధైర్యం చెబుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఆసిస్ పై భారత్ హృదయ విదారక ఓటమిని ఎదుర్కొంది. అనుష్క శర్మ తన భర్త విరాట్ కోహ్లీని కౌగిలించుకున్న వైరల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా హృదయాలను కదిలించింది. అహ్మదాబాద్ నగరంలోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అభిమానులు బ్లూకలర్ జెర్సీ ధరించి రావడంతో స్టేడియం నీలిమయంగా మారింది. ఆరు వికెట్ల పరాజయం అనంతరం అనుష్కశర్మ కోహ్లీని వెచ్చని కౌగిలింతతో ఓదార్చడం అందరినీ కదిలించింది.. ఇక ఈ పిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది కూడా..

విరాట్ 50 పరుగుల మైలురాయిని చేరుకున్నప్పుడు అనుష్క తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయింది. అనుష్క కోహ్లీకి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలు తమ కుటుంబ సభ్యులతో కలిసి మైదానం వీడేటప్పుడు కన్నీటిపర్యంతమయ్యారు..షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్, దీపికా పదుకొణె వంటి సెలెబ్రేటీలు ఓటమితో నరేంద్ర మోడీ స్టేడియంలో తీవ్ర నిరాశ చెందారు. ఆస్ట్రేలియా ట్రోఫీని కైవసం చేసుకోవడంతో వాతావరణం గంభీరంగా మారింది. స్టాండ్‌ల నుంచి ఆనందోత్సాహాలు కరువయ్యాయి.. ఇక విరాట్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పటికీ విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును అందుకున్నారు..