NTV Telugu Site icon

Anchor Falls: యాంకర్‌పై పడిపోయిన ఫీల్డర్.. నవ్వులే నవ్వులు

Anchor Falls

Anchor Falls

Anchor Falls: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. బంతిని బౌండరీ లైన్ వద్ద ఆపేందుకు ప్రయత్నించిన ఫీల్డర్ నేరుగా మహిళా యాంకర్‌ను ఢీకొట్టడం నవ్వులు పూయించింది. బౌండరీ వద్ద రిపోర్ట్ చేస్తున్న సమయంలో ఇలా జరిగింది. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్‌గా మారగా క్రికెట్ ఫ్యాన్స్ సరదా కామెంట్స్‌తో సందడి చేస్తున్నారు.

Read Also: Vladimir Putin: సందేహమే లేదు.. ఉక్రెయిన్‌పై గెలిచి తీరుతామన్న పుతిన్

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్-ఎంఐ కేప్‌టౌన్ జట్ల మధ్య మ్యా్చ్ జరిగింది. సన్‌రైజర్స్ బ్యాటింగ్ సమయంలో సామ్ కరన్ వేసిన 13వ ఓవర్లో డీప్ వికెట్ మీదుగా మార్కో జాన్సన్ కొట్టిన షాట్ బౌండరీవైపు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరు ఫీల్డర్లు బంతిని ఆపేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో కోచ్‌లను ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్ట్ జైనాబ్ అబ్బాస్‌ బౌండరీ వద్దే ఉంది. దీంతో నేరుగా యాంకర్‌ను ఫీల్డర్ ఢీకొట్టడంతో ఆమె బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయింది. కానీ పెద్ద గాయం ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ మ్యాచ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌పై సన్‌రైజర్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేప్‌టౌన్ 20 ఓవర్లలో 171/6 స్కోర్ చేయగా.. సన్‌రైజర్స్ 19.3 ఓవర్లలో 172/8 పరుగులు చేసి విక్టరీ సాధించింది. మార్కో జాన్సన్ 27 బంతుల్లో 66 రన్స్‌ చేసి సన్‌రైజర్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

Show comments