Site icon NTV Telugu

నీరజ్‌ చోప్రాకు బహుమతి ప్రకటించిన ఆనంద్‌ మహీంద్ర…

తాజాగా జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన భారత అథ్లెట్‌ నీరజ్‌ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర నీరజ్‌ చోప్రాను బాహుబలి అంటూ ప్రశంసించారు. ఈ క్రమంలో ఓ ట్విటర్‌ యూజర్‌ నీరజ్‌ చోప్రాకు మహీంద్ర కంపెనీ త్వరలో లాంచ్‌ చేయనున్న ఎస్‌యూవీ శ్రేణికి చెందిన ఎక్స్‌యూవీ 700ని ఇవ్వాలిసిందిగా అభ్యర్థించాడు. రితేష్‌ అభ్యర్థనను అంగీకరించిన ఆనంద్‌ మహీంద్ర.. ”తప్పకుండా ఇస్తానని ప్రకటించాడు. స్వర్ణం సాధించిన మా అథ్లెట్‌కు ఎక్స్‌యూవీ 700 బహుమతిగా ఇవ్వడం తనకు ఎంతో గౌరవమని రిప్లై ఇచ్చాడు.

Exit mobile version