NTV Telugu Site icon

Ambati Rayudu: ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పిన రాయుడు.. ఇక నో యూటర్న్

Ambati Rayudu Retired

Ambati Rayudu Retired

Ambati Rayudu Says Good Bye To IPL: టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నైసూపర్‌ కింగ్స్‌ బ్యాటర్‌ అంబటి రాయుడు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఐపీఎల్‌-2023 సీజన్‌లో భాగంగా.. మే 28వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ అనంతరం తాను తప్పుకుంటున్నట్టు రాయుడు స్పష్టం చేశాడు. ఆ ఫైనల్ మ్యాచ్‌కి ముందు అతడు ట్విటర్ మాధ్యమంగా ఈ సంచలన ప్రకటన చేశాడు. ‘‘ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి రెండు అద్భుతమైన జట్లకు ప్రాతినిద్యం వహించినందుకు చాలా గర్వంగా ఉంది. ఆ రెండు జట్ల తరఫున 204 మ్యాచ్‌లు, 14 సీజన్‌లు, 11 ప్లేఆఫ్‌లు, 8 ఫైనల్స్, 5 ట్రోఫీల ట్రాక్ రికార్డ్‌ని సొంతం చేసుకున్నాను. నిజంగా ఇదొక అద్భుతమైన ప్రయాణం. సీఎస్కే, జీటీ ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఈ టోర్నమెంట్‌ని నేనెంతో ఎంజాయ్ చేశాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. మళ్లీ యూ టర్న్‌ తీసుకోను’’ అంటూ ట్విటర్‌లో రాయుడు రాసుకొచ్చాడు.

KL Rahul: నా భర్తను అనడానికి మీరెవరు.. అడల్ట్ క్లబ్ ఫొటోపై రాహుల్ భార్య ఫైర్

కాగా.. 2010లో ముంబై ఇండియన్స్‌ తరపున అంబటి రాయుడు ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. మొదట్లో పెద్దగా రాణించలేదు కానీ, ఆ తర్వాత అతడు తన సత్తా చాటుకున్నాడు. బ్యాటర్‌గా తాను ఎలాంటి అద్భుతాలు సృష్టించగలనో చూపించాడు. ముంబై ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని, బ్యాటర్‌గా ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఫలితంగా.. టీమిండియాలోనూ చోటు సంపాదించాడు. 2013, 2015, 2017 సీజన్‌లలో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టులో రాయుడు భాగంగా ఉన్నాడు. 2017 సీజన్ వరకు ముంబైఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రాయుడు.. ఆ తర్వాత 2018 సీజన్‌లో చెన్నైసూపర్‌కింగ్స్‌ జట్టులోకి చేరాడు. ఆ జట్టు తరఫున కూడా అతడు ఐపీఎల్‌లో గొప్పి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో ఓవరాల్‌గా 204 మ్యాచ్‌లు ఆడిన రాయుడు.. 28.29 సగటున 127.29 స్ట్రైక్ రేట్‌తో 4329 పరుగులు సాధించాడు. ఇందులో 22 అర్థశతకాలు, ఒక సెంచరీ ఉన్నాయి.

Margani Bharath: టీడీపీకి ఇది మహానాడు కాదు.. చివరినాడు