Ambati Rayudu: ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పిన రాయుడు.. ఇక నో యూటర్న్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rayudu Says Good Bye To IPL: టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నైసూపర్ కింగ్స్ బ్యాటర్ అంబటి రాయుడు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఐపీఎల్-2023 సీజన్‌లో భాగంగా.. మే 28వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ అనంతరం తాను తప్పుకుంటున్నట్టు రాయుడు స్పష్టం చేశాడు. ఆ ఫైనల్ మ్యాచ్‌కి ముందు అతడు ట్విటర్ మాధ్యమంగా ఈ సంచలన ప్రకటన చేశాడు. ‘‘ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి రెండు అద్భుతమైన జట్లకు ప్రాతినిద్యం వహించినందుకు చాలా గర్వంగా ఉంది. ఆ రెండు జట్ల తరఫున 204 మ్యాచ్‌లు, 14 సీజన్‌లు, 11 ప్లేఆఫ్‌లు, 8 ఫైనల్స్, 5 ట్రోఫీల ట్రాక్ రికార్డ్‌ని సొంతం చేసుకున్నాను. నిజంగా ఇదొక అద్భుతమైన ప్రయాణం. సీఎస్కే, జీటీ ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఈ టోర్నమెంట్‌ని నేనెంతో ఎంజాయ్ చేశాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. మళ్లీ యూ టర్న్ తీసుకోను’’ అంటూ ట్విటర్‌లో రాయుడు రాసుకొచ్చాడు.

Also Read
- US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
KL Rahul: నా భర్తను అనడానికి మీరెవరు.. అడల్ట్ క్లబ్ ఫొటోపై రాహుల్ భార్య ఫైర్
కాగా.. 2010లో ముంబై ఇండియన్స్ తరపున అంబటి రాయుడు ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. మొదట్లో పెద్దగా రాణించలేదు కానీ, ఆ తర్వాత అతడు తన సత్తా చాటుకున్నాడు. బ్యాటర్‌గా తాను ఎలాంటి అద్భుతాలు సృష్టించగలనో చూపించాడు. ముంబై ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని, బ్యాటర్‌గా ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఫలితంగా.. టీమిండియాలోనూ చోటు సంపాదించాడు. 2013, 2015, 2017 సీజన్‌లలో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టులో రాయుడు భాగంగా ఉన్నాడు. 2017 సీజన్ వరకు ముంబైఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రాయుడు.. ఆ తర్వాత 2018 సీజన్‌లో చెన్నైసూపర్‌కింగ్స్ జట్టులోకి చేరాడు. ఆ జట్టు తరఫున కూడా అతడు ఐపీఎల్‌లో గొప్పి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో ఓవరాల్‌గా 204 మ్యాచ్‌లు ఆడిన రాయుడు.. 28.29 సగటున 127.29 స్ట్రైక్ రేట్‌తో 4329 పరుగులు సాధించాడు. ఇందులో 22 అర్థశతకాలు, ఒక సెంచరీ ఉన్నాయి.
Margani Bharath: టీడీపీకి ఇది మహానాడు కాదు.. చివరినాడు
2 great teams mi nd csk,204 matches,14 seasons,11 playoffs,8 finals,5 trophies.hopefully 6th tonight. It’s been quite a journey.I have decided that tonight’s final is going to be my last game in the Ipl.i truly hav enjoyed playing this great tournament.Thank u all. No u turn 😂🙏
— ATR (@RayuduAmbati) May 28, 2023
తాజావార్తలు
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!