NTV Telugu Site icon

Rahul Dravid: ఐపీఎల్ టీంకి మెంటర్‌గా రాహుల్ ద్రవిడ్..

Rahul Dravid

Rahul Dravid

Rahul Dravid: టీ 20 ప్రపంచకప్‌ని టీమిండియా గెలుచుకోవడంపై ఫ్యాన్ ఆనందంగా ఉన్నారు. అయితే, ఈ విజయం వెనక కోచ్ రాహుల్ ద్రావిడ్ ఘనతను కూడా కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే, త్వరలో కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ దిగిపోనున్నారు. టీమిండియాకు కొత్త కోచ్‌ బాధ్యతలని గౌతమ్ గంభీర్ తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) సొంతం చేసుకోవడంతో గంభీర్ పాత్ర మరవలేనిది. ఆ టీం మెంటర్‌గా ఉంటూ కేకేఆర్ కప్ కొట్టడంతో కీలక భూమిక పోషించారు.

Read Also: Xiaomi SU7: Xiaomi SU7 ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది.. ఒక్క ఛార్జ్‌తో 800 కి.మీ రేంజ్..

ఇదిలా ఉంటే, గంభీర్ ఒక వేళ టీమిండియా కోచ్ బాధ్యతల్ని తీసుకుంటే, కేకేఆర్ పరిస్థితి ఏంటనే ప్రశ్న వినిపిస్తున్న నేపథ్యంలో సరికొత్త వార్త ఆ జట్టు ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తోంది. గంభీర్ నిష్క్రమిస్తే కేకేఆర్ మెంటర్ బాధ్యతల్ని తీసుకునేందుకు ఆ ఫ్రాంఛైజీ ఉన్నతాధికారులు రాహుల్ ద్రావిడ్ పేరును షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం. ఐపీఎల్-2025 సీజన్ ముందు రాహుల్ ద్రావిడ్‌ని కేకేఆర్ కోచ్ లేదా మెంటర్‌గా తీసుకోవాలని ఆసక్తి కనబరుస్తోంది. అయితే, దీనిపై ఖచ్చితమైన చర్చ జరగలేదని తెలుస్తోంది.

ఏడాదికి 10 నెలల పాటు ప్రయాణాలు చేయడం ఇష్టం లేని ద్రవిడ్ భారత్ జట్టు కోచ్‌గా కొనసాగేందుకు ఇష్టపడటం లేదు. ఐపీఎల్ విషయానికి వస్తే దీనికి రివర్స్. కేవలం ఏడాదిలో 2-3 నెలలు మాత్రమే ఫ్రాంజైజీతో ఉండాలి. ఈ అంశం ద్రవిడ్‌కి లాభిస్తుంది. గతంలో ఐపీఎల్ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీకి కోచ్‌గా ఉఎన్నారు. ఆ తర్వాత అండర్-19, ఇండియా-ఏతో సహా భారత జూనియర్ జట్లకు కోచ్‌గా పనిచేశారు. 2021లో బెంగళూర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమి(ఎన్సీఏ) అధిపతిగా పనిచేశారు.