Site icon NTV Telugu

Shahid Afridi: ఐసీయూలో పాకిస్తాన్ క్రికెట్.. పీసీబీపై విరుచుకుపడ్డ షాహిద్ అఫ్రిది

Afrid

Afrid

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్తాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. రెండు జట్ల మధ్య 5 T20లు, 3 ODIలు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టును ఇప్పటికే ప్రకటించారు. షాదాబ్ ఖాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. దీనిపై పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 జట్టులోకి ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ తిరిగి రావడాన్ని మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రశ్నించాడు. పీసీబీ తప్పుడు నిర్ణయాల కారణంగా పాకిస్తాన్ క్రికెట్ ఐసీయూలో ఉందని అన్నాడు.

Also Read:WPL 2025 Final: బెంగళూరు చేతిలో ముంబై ఓటమి.. డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌కు ఢిల్లీ!

గత T20 ప్రపంచ కప్ నుంచి ఆటకు దూరంగా ఉన్న షాదాబ్‌ను తిరిగి జట్టులోకి తీసుకుని, న్యూజిలాండ్‌తో జరిగే విదేశీ సిరీస్ కోసం పాకిస్తాన్ T20 జట్టులో సల్మాన్ అలీ అఘా స్థానంలో వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఈ వ్యవహారంపై ఫైర్ అయిన ఆఫ్రిది.. ఏ ప్రాతిపదికన అతన్ని వెనక్కి పిలిచారు? దేశవాళీ క్రికెట్‌లో అతని ప్రదర్శన ఎలా ఉంది? అతన్ని మళ్లీ జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారు అని షాహిద్ అఫ్రిది అన్నారు. అర్హత ఆధారంగా నిర్ణయాలు తీసుకునే వరకు పాకిస్తాన్ క్రికెట్‌లో ఏమీ మారదని ఈ ఆల్ రౌండర్ అన్నారు.

Also Read:Sandeep Reddy : ప్రభాస్ కే కండీషన్లు పెడుతున్న సందీప్ రెడ్డి.. అలా ఉంటేనే ఓకే

బోర్డు నిర్ణయాలు, విధానాలలో ఏకాభిప్రాయం లేదు. మేము కెప్టెన్లు, కోచ్‌లు, కొంతమంది ఆటగాళ్లను మారుస్తూనే ఉన్నాము కానీ చివరికి బోర్డు అధికారుల జవాబుదారీతనం ఏమిటి అని మాజీ కెప్టెన్ ప్రశ్నించాడు. తన ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి కోచ్ ఆటగాళ్లను నిందించడం బాధగా ఉందని, తమ సీటును కాపాడుకోవడానికి ఆటగాళ్లను, కోచ్‌లను యాజమాన్యం నిందించడం బాధగా ఉందని ఆయన అన్నారు. డామోక్లెస్ కత్తి నిరంతరం కెప్టెన్లు, కోచ్‌ల తలలపై వేలాడుతూ ఉన్నప్పుడు మన క్రికెట్ ఎలా అభివృద్ధి చెందుతుంది?అని అన్నాడు. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సానుకూల దృక్పథం కలిగిన వ్యక్తి అని, కానీ నిజం ఏమిటంటే అతనికి క్రికెట్ గురించి పెద్దగా తెలియదని అఫ్రిది అన్నారు. PCB ఛైర్మన్ గా ఉండటం పూర్తి సమయం ఉద్యోగం కాబట్టి అతను ఒక విషయంపై దృష్టి పెట్టాలి అని అఫ్రిది అన్నారు.

Exit mobile version