2027 ODI World Cup: ప్రపంచ కప్‌కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్‌కు బిగ్ షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan Qualify for 2027 ODI World Cup: 2027 వన్డే ప్రపంచ కప్‌కు పసికూన అఫ్గానిస్థాన్ నేరుగా అర్హత సాధించింది. ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 3 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో.. అఫ్గాన్ మెగా టోర్నీలో తమ స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కీలకంగా నిలిచాడు. బంతితో మూడు వికెట్లు తీసి, బ్యాటింగ్‌లో (43 బంతుల్లో అజేయంగా 37 పరుగులు) కీలక సమయంలో అజేయ ఇన్నింగ్స్ ఆడిన రషీద్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఐదు వన్డేల సిరీస్‌లో అఫ్గానిస్థాన్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది.
ఐర్లాండ్‌పై సాధించిన విజయంతో అఫ్గానిస్థాన్ 2027 వన్డే ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించింది. 2023 ప్రపంచ కప్‌లోనూ అఫ్గాన్ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచిన అఫ్గాన్.. నాలుగు విజయాలు, ఐదు ఓటములు నమోదు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, మాజీ ఛాంపియన్ శ్రీలంక, పాకిస్థాన్ వంటి జట్లను ఓడించి సత్తా చాటింది. ఇప్పుడు 2027 ప్రపంచ కప్‌లోనూ అఫ్గానిస్థాన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రషీద్ ఖాన్ వంటి సీనియర్ ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభకు తోడవడంతో.. ఈసారి మెగా టోర్నీలో మరింత ముందుకు వెళ్లాలని అఫ్గాన్ చూస్తోంది.
Also Read
- RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
- Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో తిరుగులేని జట్టుగా వెలుగొందిన వెస్టిండీస్ వన్డే ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. గత ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించలేకపోయిన విండీస్.. క్వాలిఫయర్స్‌లోనూ పేలవ ప్రదర్శన చేసి మూల్యం చెలించుకుంది. ఈ సారి కూడా విండీస్ నేరుగా అర్హత సాధించలేకపోయింది. సోమవారం ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో అఫ్గానిస్థాన్ విజయం సాధించగా.. విండీస్ ఆశలు ఆవిరయ్యాయి. వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగా.. నేరుగా మెగా టోర్నీకి అర్హత సాధించడానికి సెప్టెంబర్ 30 వరకు ఐసీసీ డెడ్‌లైన్ విధించింది. అప్పటిలోగా టాప్-8లో నిలిచిన జట్లు నేరుగా క్వాలిఫై అవుతాయి.
ఆతిథ్య దేశాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్లు ప్రపంచ కప్‌కు ఆటోమేటిక్ అర్హత సాధిస్తాయి. ఐర్లాండ్‌పై విజయంతో అఫ్గానిస్థాన్ టాప్-8లోకి దూసుకొచ్చింది. ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే క్వాలిఫై అయ్యాయి. కటాఫ్ తేదీ నాటికి వెస్టిండీస్ రెండు వన్డేలు మాత్రమే ఆడనుంది. ఆ రెండింటిలో గెలిచినా అఫ్గాన్‌ను విండీస్ వెనక్కినెట్టే అవకాశం లేదు. వెస్టిండీస్ ప్రపంచ కప్‌లో ఆడాలంటే 10 జట్లతో జరిగే క్వాలిఫయర్స్ అద్భుత ప్రదర్శన చేయాల్సి చేయాలి.
తాజావార్తలు
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!