Site icon NTV Telugu

Abhishek Sharma: టీ20 ప్రపంచకప్‌కు ముందు టెన్షన్‌ పెడుతున్న అభిషేక్ శర్మ!

Abhishek Sharma Form

Abhishek Sharma Form

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు నెల రోజుల కన్నా తక్కువ సమయం మాత్రమే ఉంది. మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఇప్పటికే 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. కివీస్ సిరీస్ సూర్య సేనకు వార్మప్‌గా ఉపయోగపడుతుంది. అయితే ప్రపంచకప్‌కు ముందు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది.

ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ ప్రస్తుతం పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. దూకుడు బ్యాటింగ్‌కు పేరుగాంచిన అభిషేక్.. గత నెల రోజులుగా పెద్దగా పరుగులు చేయడం లేదు. మంచి ఆరంభాలు ఇచ్చినా.. భారీ ఇన్నింగ్స్ మాత్రం ఆడలేదు. గత 10 ఇన్నింగ్స్‌లలో (దేశీయ మరియు అంతర్జాతీయ) ఒకే ఒక అర్ధ సెంచరీ చేశాడు. డిసెంబర్ 2న సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో చివరగా అర్ధ సెంచరీ బాదాడు. అభిషేక్ ఫామ్ ఇప్పుడు టీమిండియాకు ఆందోళన కలిగించే విషయమే. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్‌లో లేడు. తిలక్ వర్మ ఆడడం సందేహంగా ఉంది. సంజు శాంసన్ స్థానంపై సందిగ్ధం నెలకొంది. మొత్తంగా ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి.

Also Read: OPPO Reno 15 Price: 200MP కెమెరా, 6,500mAh బ్యాటరీ.. మతిపోయే ఫీచర్లతో ఒప్పో రెనో 15 లాంచ్!

టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు:
సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), అక్షర్‌ పటేల్‌ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌ (వికెట్ కీపర్), తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, రింకు సింగ్‌, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, ఇషాన్‌ కిషన్‌ (వికెట్ కీపర్).

Exit mobile version