కీలక దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీని చావుదెబ్బ కొట్టింది. ఈ ఓటమితో క్వాలిఫయర్ వన్‌కి అర్హత సాధించాలని భావించిన ఆర్సీబీకి చుక్కెదురైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.
ఇది కూడా చదవండి: KTR: ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ కు కేటీఆర్ కౌంటర్.. అసలు దెయ్యం అతనే అంటూ..
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కొట్టిన ఓ భారీ షాట్ స్పాన్సర్‌కు భారీ నష్టాలను మిగిల్చింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ డీప్ మిడ్‌వికెట్ వైపు భారీ షాట్ బాదాడు. బంతి నేరుగా వెళ్లి కారుపై పడటంతో అద్దం ముక్కలైంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యువరాజ్ శిష్యుడు అంటే ఆ మాత్రం ఉంటాది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Oasis Fertility: మాతృత్వం పట్ల గౌరవానికి ప్రతీకగా ‘ఒయాసిస్ జనని యాత్ర’.. ప్రారంభించిన ఒయాసిస్ ఫెర్టిలిటీ
ఇకపోతే ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఫర్వాలేదనిపించాడు. 3 ఫోర్లు ,3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసి ఆ తర్వాత విఫలమైన ఇషాన్ కిషన్.. ఈ మ్యాచ్‌లో జూలు విదిల్చాడు. భారీ స్కోర్ చేసి వన్ మేన్ షో చూపించాడు. తన 94 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆధారంగా SRH 231 స్కోర్ చేయగలిగింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫీల్ సాల్ట్ అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వాళ్లిద్దరూ ఆరంభం నుంచే దూకుడుగా ఆడటంతో పవర్ ప్లే ముగిసేసరికి ఆర్సీబీ ఖాతాలో 72 పరుగులు నమోదయ్యాయి. అయితే కోహ్లీ అవుట్ అయిన తర్వాత ఆర్సీబీ స్కోర్ నెమ్మదించింది. మిడిలార్డర్ పూర్తిగా విఫలం కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.
