NTV Telugu Site icon

తన టెస్ట్ జట్టులో కోహ్లీ, బుమ్రాలకు చోటివ్వని చోప్రా…

భారత మాజీ ఆటగాడు.. ప్రస్తుత క్రికెట్ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా ఈ ఏడాదికి సంభందించిన తన టెస్ట్ జట్టును ప్రకటించాడు. కానీ అందులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే పేసర్ బుమ్రాలకు చోటివ్వలేదు. అయితే ఈ 2021కి సంబంధించిన తన టెస్ట్ జట్టులో ఓపెనర్లుగా భారత ఓపెనర్ రోహిత్ శర్మతో పాటుగా శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నే ను ఎంచుకున్నాడు. అలాగే వన్ డౌన్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ను తీసుకున్న చోప్రా ఆ ఆతర్వాత కేన్ విలియమ్సన్ ను ఎంచుకున్నాడు. తన జట్టు కెప్టెన్సీ కూడా కేన్ కే అప్పగించాడు చోప్రా.

అయితే నెంబర్ 5 లో పాకిస్థాన్ ఆటగాడు ఫవాద్ ఆలం ను ఎంపిక చేసిన చోప్రా వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ను ఎంచుకున్నాడు. అలాగే ఆల్ రౌండర్లుగా కైల్ జేమీసన్, రవిచందన్ అశ్విన్, అక్షర్ పటేల్ ను.. పెసర్లుగా జేమ్స్ అండర్సన్, షాహీన్ అఫ్రిదికి చోటిచ్చాడు. కానీ ప్రస్తుతం ఫామ్ లో లేని కోహ్లీని అలాగే ఈ ఏడాది అంతగా రాణించాలేకపోయిన బుమ్రాను తన జట్టులకి తీసుకోలేదు చోప్రా.