NTV Telugu Site icon

Virat Kohli: విరాట్ కోహ్లీకి లేడీ ఫ్యాన్ లిప్‌లాక్.. వీడియో వైరల్

Kohli Lady Fan Liplock

Kohli Lady Fan Liplock

A Lady Fan Kissed Virat Kohli Wax Statue Lips: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిన్న, పెద్ద, ఆడ, మగ అని తేడా లేకుండా.. విశ్వవ్యాప్తంగా ఇతనికి కోట్లలో అభిమానులు ఉన్నారు. అసలు టీవీల్లో చూస్తేనే.. కోహ్లీ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. అలాంటిది.. లైవ్‌లో కనిపిస్తే ఊరికే ఉంటారా? అతడ్ని చూసేందుకు, కలిసి ఫోటో దిగేందుకు ఎగబడిపోతారు. ఒకవేళ కోహ్లీతో ఫోటో దిగే అవకాశం రాకపోతే.. అతని పోస్టర్లతోనే ఫోటోలు దిగి మురిసిపోతుంటారు. అదీ.. కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్. ఇప్పుడు ఓ లేడీ ఫ్యాన్ కోహ్లీ మైనపు బొమ్మను ముద్దాడటం హాట్ టాపిక్‌గా మారింది.

Volodymyr Zelenskyy: చైనా ఆ పని చేస్తే ‘వరల్డ్ వార్’ తప్పదు.. జెలెన్‌స్కీ హెచ్చరిక

క్రికెట్ క్రీడలో ఎన్నో రికార్డులు, ఘనతలో సాధించిన కోహ్లీ సేవలను గుర్తిస్తూ.. అతని మైనపు బొమ్మను సిద్ధం చేశారు. ఒకటి ఢిల్లీలో ఉండగా, మరొకటి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంది. ఈ మైనపు బొమ్మను చూసిన కోహ్లీ ఫ్యాన్.. తన ఆనందాన్ని ఆపుకోలేక ఆ బొమ్మ పెదాలపై ముద్దాడింది. తాను నిజంగానే కోహ్లీని ముద్దాడుతున్నంత ఆనందాన్ని ఆ ఫ్యాన్ కనబరిచింది. ఓసారి పెదాలపై, మరోసారి తన బుగ్గలకు ఆ బొమ్మ పెదాలు తాకేలా ఆ లేడీ ఫ్యాన్ వీడియో తీసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కోహ్లీ బొమ్మను ఆమెను చూస్తున్న విధానం, ముద్దాడాక మురిసిపోయిన తీరు చూస్తే.. కోహ్లీ అంటే ఆ లేడీ ఫ్యాన్‌కి ఎంత పిచ్చో అర్థం చేసుకోవచ్చు.

Mystery Revealed : మిస్సింగ్‌ రైలు మిస్టరీ వీడింది.. వేలకోట్లు విలువ చేసే సామాగ్రితో

ఇదిలావుండగా.. గతేడాది ఆసియా కప్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ టీ20, వన్డే ఫార్మాట్‌లలో సెంచరీలు చేశాడు. కానీ, టెస్టుల్లోనే ఇంకా పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడు టెస్టుల్లో చివరిసారి సెంచరీ చేసింది 2019 నవంబర్ 22న. ఆ తర్వాతి నుంచి టెస్టుల్లో అతడు సెంచరీ చేసిందే లేదు. ఈ నేపథ్యంలోనే.. ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ దుమ్ముదులిపేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తొలి రెండు టెస్ట్ మ్యాచెస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా.. మూడో మ్యాచ్‌లో అయినా రప్ఫాడిస్తాడని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.