NTV Telugu Site icon

యూఏఈ వేదికగానే టీ20 వరల్డ్ కప్..

గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఈ ఏడాది భారత్ వేదికగా జరగాల్సి ఉంది. కానీ కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో ఈ ఏడాది ఇండియాలో ప్రారంభమైన ఐపీఎల్ 2021 సీజన్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దానిని యూఏఈ వేదికగా నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే టీ20 ప్రపంచ కప్ నిర్వహణ పై కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఐసీసీ తెలపడంతో రెండు వరాల గడువు అడిగిన బీసీసీఐ తాజాగా టీ20 వరల్డ్ కప్ ను కూడా యూఏఈ వేదికగానే నిర్వహిచనున్నట్లు ప్రకటించింది. ఐపీఎల్ 2021 ముగిసిన రెండు రోజుల తర్వాత అంటే అక్టోబర్ 17న ఈ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. అయితే కరోనా నియమాలను పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ టోర్నీని నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ జే షా పేర్కొన్నారు.