T20 World Cup: 2022 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. అయితే టీ20 ప్రపంచకప్ 2021, 2022లో క్వాలిఫయింగ్ దశలున్నాయి. కానీ టీ20 ప్రపంచకప్ 2024లో మాత్రం క్వాలిఫయింగ్ రౌండ్ ఉండదు. అదే సమయంలో సూపర్ 12 కూడా ఉండదు. 2024 ప్రపంచకప్‌లో భారీ మార్పులు చేయాలని ఐసీసీ నిర్ణయించింది. కొత్త ఫార్మాట్ వివరాలను ఐసీసీ తాజాగా వెల్లడించింది. అభిమానులకు మజా ఇచ్చే రీతిలో వచ్చే టీ20 ప్రపంచకప్ టోర్నీలో టైటిల్ కోసం ఏకంగా 20 జట్లు పోటీ పడనున్నాయి. అంతేకాకుండా వచ్చే సీజన్‌లో క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు ఉండవు. 20 జట్లు నాలుగు గ్రూపులుగా తలపడతాయి. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఆడతాయి. ఒక్కో గ్రూప్ నుంచి రెండేసి జట్లు సూపర్-8లోకి అడుగుపెడతాయి. సూపర్-8లో మళ్లీ 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోతాయి. ఒక్కో గ్రూప్ నుంచి టాప్-2 జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
Read Also: IND Vs NZ: టీమిండియా అదుర్స్.. మూడో టీ20లో హ్యాట్రిక్ కాని హ్యాట్రిక్
ఈ టోర్నీలో ఆతిథ్య జట్లుగా అమెరికా, వెస్టిండీస్ నేరుగా టోర్నీకి అర్హత సాధించాయి. ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇండియా, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ వంటి జట్లు నేరుగా ఆడనున్నాయి. వీటితో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ జట్లు అర్హత పొందాయి. మరో 8 స్థానాల కోసం ప్రాంతీయ అర్హత ఆధారంగా క్వాలిఫై మ్యాచులు జరగనున్నాయి. ఆఫ్రికా, ఆసియా, యూరప్ ఖండాలు రెండు క్వాలిఫికేషన్ స్పాట్‌లను కలిగి ఉండగా.. అమెరికా, తూర్పు ఆసియా పసిఫిక్ ఒక్కో స్థానాన్ని కలిగి ఉన్నాయి. ప్రాంతీయ అర్హత ఆధారంగా ఎన్నికైన 8 జట్లు నాలుగు గ్రూపులలో రెండేసి చొప్పున ఆడనున్నాయి.
Read Also: FIFA World Cup: అర్జెంటీనాకు షాక్.. సౌదీ అరేబియా ఘనవిజయం
