తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల కిందట విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌కి అప్పుడే న్యాయపరమైన చిక్కులు మొదలయ్యాయి. ఈ నోటిఫికేషన్ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందంటూ ఇద్దరు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయగా దానిపై ఇవాళ విచారణ జరగనుంది. మహిళా రిజర్వేషన్లను అమలుచేయటం వల్ల అనేక మంది పురుష అభ్యర్థులు నష్టపోనున్నారని రోహిత్ బాల, కృష్ణ అనే ఇద్దరు ఉద్యోగార్థులు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
తమకు మెరిట్ ఉన్నప్పటికీ ఉద్యోగాలు పొందలేని పరిస్థితి నెలకొందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ నియామకాల్లో, మెడికల్ సీట్ల భర్తీలో కూడా మహిళా రిజర్వేషన్లను సమాంతరం(Horizontal)గా అమలుచేస్తుండటాన్ని తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఏం తీర్పు చెబుతుందో చూడాలి. తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.
503 పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా ఏప్రిల్ 26వ తేదీన నోటిఫికేషన్ జారీ అయింది. 3 లక్షల 80 వేల 202 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు యావరేజ్‌గా 756 మంది పోటీలో ఉన్నారు. వీళ్లందరికీ అక్టోబర్ 16న ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి హైకోర్టు జడ్జిమెంటుపై ఉత్కంఠ నెలకొంది.
BJP Focus on 144 MP Seats: ఎంపీ సీట్లపై బీజేపీ స్పెషల్ ఫోకస్. అందుకే.. ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’.
