Site icon NTV Telugu

Success Story : పూల సాగు తో ప్రతినెల 70వేల ఆదాయాన్ని పొందుతున్న రైతు..

flower farming

flower farming

మంచి కంపెనీలో ఉద్యోగం..మంచి జీతం అయిన కూడా ఏదో తెలియని కొరత.. ఇంకా ఏదైనా సాధించాలని ఉద్యోగాన్ని వదిలేసాడు.. కష్టాన్ని నమ్ముకొని ఇప్పుడు అందరికి ఆదర్శంగా మారాడు..ఈ క్రమంలోనే అతను పొలం బాట పట్టాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగంలో లభించని సంతోషాన్ని వ్యవసాయంలో వెతుక్కుంటూ పల్లెటూరి బాటపట్టాడు.. మార్కెట్ ను శాసిస్తున్న డిమాండ్ ఉన్న వ్యవసాయం ఏంటో, దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు..స్థానిక వాతావరణ పరిస్థితులను నిశితంగా పరిశీలించాడు. ఏడాది పొడవునా ఆదాయం వచ్చే పంటలను సాగు చేయటం ద్వారా మంచి అదాయం పొందవచ్చని గుర్తించాడు. అనుకున్నదే తడువుగా గులాబీల సాగుకు శ్రీకారం చుట్టాడు. ఏలూరు వాసి పృథ్వీ..

ఇతను కష్టపడి బీటెక్ విద్య పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు. అయితే అది ఏమాత్రం నచ్చకపోవటంతో తన తండ్రులు అనుసరించిన వ్యవసాయన్ని కొనసాగించాలని నిర్ణయించుకుని సొంత ఊరు వచ్చేశాడు. వాణిజ్య పంటలలో గులాబీ సాగు మంచి లాభాలను అందిస్తుందని తెలుసుకున్నాడు.. గులాబీ సాగులో మెళుకువులను తెలుసుకున్నాడు. 15 ఎకరాల్లో గులాబీ పూల సాగు ప్రారంభించాడు. బెంగుళూరు రకం, సెంటు రకాల సాగు చేపట్టాడు.. అదే అతని పనిగా మార్చుకున్నాడు సక్సెస్ గా రానిస్తున్నాడు..

మొక్క నాటిన 5 నెలల నుంచి పూల దిగుబడి ప్రారంభమైంది. మూడు సీజన్‌లకు కలిపి ప్రతి నెల సుమారుగా 400 కేజీల పూల వరకు విక్రయిస్తున్నాడు. నెలకు నికరంగా 60 నుంచి 70 వేల వరకు లాభం పొందుతున్నాడు. ఒకసారి మొక్కలు నాటితే 6 నుంచి 8 ఏళ్ల వరకు పూల ఉత్పత్తి వస్తుంది. ప్రతి నెల నికర ఆదాయం లభిస్తుండటంతో తోటి రైతులు సైతం గులాబీ సాగువైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో మేలు రకాల పూలను సాగు చేస్తూ మంచి అదాయం పొందుతున్నాడు.. అదే తనకు తృప్తిని ఇస్తుందని చెప్పుకొచ్చాడు.. దేశ వ్యాప్తంగా తన పూలను అమ్మాలని కోరుకుంటున్నాడు..

Exit mobile version