NTV Telugu Site icon

Sports Sponsorships: ఆదాయం @ మైదానం. మన దేశ క్రీడా రంగానికి మరపురాని సంవత్సరం

Sports Sponsorships

Sports Sponsorships

Sports Sponsorships: మన దేశ క్రీడా రంగానికి 2022వ సంవత్సరం మరపురాని ఏడాదిగా మిగిలిపోయింది.. విజయాల పరంగా కాదు.. వ్యాపారం పరంగా. ఎందుకంటే.. గతేడాది.. స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్‌లు ఏకంగా 49 శాతం వృద్ధి చెందాయి. తద్వారా 14 వేల 209 కోట్ల రూపాయలకు చేరాయి. పోయినేడాది పెద్ద సంఖ్యలో స్పోర్ట్స్ ఈవెంట్స్ జరగటమే ఇందుకు కారణం. క్రీడా రంగంలో జరిగిన మొత్తం ఖర్చులో కేవలం క్రికెట్ కే 85 శాతం జరగటం విశేషం.

Be careful of ChatGPT: చాట్‌జీపీటీతో పర్సనల్‌ డేటాను షేర్‌ చేస్తే ఏమవుతుందో చూడండి

ముఖ్యంగా.. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ లో కొ్త్త టీమ్ లు చేరటం.. ఫలితంగా నంబరాఫ్ మ్యాచ్ లు పెరగటం వల్ల వివిధ ఒప్పందాల సంఖ్య పెరిగింది. ప్లేయర్లతో పలు కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందాలు 20 శాతం గ్రోత్ నమోదు చేశాయి. టీవీల్లో వాణిజ్య ప్రకటనల కోసం బ్రాండెడ్ సంస్థలు వెచ్చించిన వ్యయం క్రీడా రంగంలో జరిగిన మొత్తం ఖర్చులో 73 శాతానికి చేరటం గమనించాల్సిన అంశం.

ఈ నేపథ్యంలో.. నో బిజినెస్ లైక్ షో బిజినెస్ అని విశ్లేషకులు అంటున్నారు. అంటే.. స్పోర్ట్స్ ఈవెంట్స్ చుట్టూ జరుగుతున్న ఈ వ్యాపారం ఏ ఇతర వ్యాపారాలతో పోల్చినా ఏమాత్రం తీసిపోదని చెబుతున్నారు. స్పోర్ట్స్ బిజినెస్.. కరోనా అనంతరం.. రెండేళ్ల తర్వాత.. 2022లో చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించింది. స్పాన్సర్ షిప్ ల కోసం సంస్థలు చేసిన ఖర్చు కిందటేడాది 14 వేల 209 కోట్ల రూపాయలుగా నమోదైంది.

కొవిడ్ కి ముందు ఇది 10 వేల కోట్ల రూపాయల కన్నా తక్కువగా ఉండేది. ఈ విషయాలను గ్రూప్-ఎం సంస్థ తన 10వ నివేదికలో వెల్లడించింది. ఈ ఎడిషన్ ని.. స్పోర్టింగ్ నేషన్ రిపోర్ట్-2023 పేరుతో విడుదల చేసింది. 2022వ సంవత్సరంలో క్రీడా రంగంలో ఎక్కువ ఖర్చు జరగటానికి దారితీసిన ఈవెంట్లు మరియు టోర్నమెంట్ల వివరాలు ఇలా ఉన్నాయి.. ఐసీసీ టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్, ఫిఫా వరల్డ్ కప్, పీకేఎల్, మారథాన్స్, మహారాష్ట్ర ఓపెన్ మరియు కామన్వెల్త్ గేమ్స్.

ఈ క్రీడల్లో పాల్గొనే ప్లేయర్లు.. తమదైన శైలిలో ప్రదర్శన చేస్తూ.. యూత్ కి.. రోల్ మోడల్స్ గా మారుతున్నారు. దీంతో కంపెనీలు స్పాన్సర్ షిప్ లు ఇచ్చేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నాయి. దీనికితోడు.. కంటెంట్ మేనేజ్మెంట్ మరియు ఫ్యాన్ ఎంగేజ్ మెంట్ కి సంబంధించి.. టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. ఫలితంగా క్రీడా రంగంలో సరికొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. ప్రత్యక్ష ప్రసారాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

ఇన్నాళ్లూ.. లైవ్ టెలికాస్టులు టీవీల్లోనే.. అంటే.. ఎలక్ట్రానిక్ మీడియాలో.. శాటి లైట్ ఛానల్స్ లోనే.. ఎక్కువగా వచ్చేవి. కానీ.. ఇప్పుడు డిజిటల్ మీడియా ప్రవేశించింది. దీంతో.. స్పోర్ట్స్ లో.. డిజిటల్ యాడ్ స్పెంస్పెండింగ్ క్రమంగా పెరుగుతోంది. డిజిటల్ మీడియాలో యాడ్స్ విలువ ఎకాఎకి 112 శాతం వృద్ధి చెంది 2 వేల 45 కోట్ల రూపాయలకు చేరింది. అన్ని మీడియాల్లో వాణిజ్య ప్రకటనల కోసం జరుగుతున్న ఖర్చులో డిజిటల్ మీడియా వాటా 2021లో 16 శాతం మాత్రమే కాగా 2022లో 27 శాతానికి పెరిగింది.