NTV Telugu Site icon

Software Jobs: ఇంజనీర్స్ అలెర్ట్.. ఇకమీదట ఆ కంపెనీల్లో ఉద్యోగాలు రావడం కష్టమే..

Btech

Btech

బీటెక్ చదువుతున్న వారు రోజు రోజుకు ఎక్కువైయ్యారు.. దాంతో ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు.. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు, కంప్యూటర్ కోర్సులు చేస్తున్నవారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్స్‌గా జాయిన్ అయ్యేందుకు వెతుకుతున్నారు.. ఆయా కంపెనీలు సైతం ప్రతి ఏడాది లక్షల మందిని నియమించుకుంటున్నారు.. అయితే ప్రతి ఏడాది ఇంజనీరింగ్ చదువుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా కంపెనీలు ఇంటర్వ్యూ లో పలు మార్పులు చేశారు.. ఇక ఇప్పుడు ఉద్యోగాలు రావడం కష్టంగా మారింది..

ఇకపై ఫ్రెషర్స్ ఉద్యోగాలు అంత సులువుగా దొరికే అవకాశం లేదు. యునైటెడ్ స్టేట్స్‌లో కొనసాగుతున్న మాంద్యం భయాలు, బలహీనమైన డీల్ పైప్‌లైన్ కారణంగా, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, యాక్సెంచర్, ఇతర ప్రముఖ టెక్ దిగ్గజాలు 2024 ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్‌ల నియామకాన్ని తగ్గించే అవకాశం ఉందని మరోవైపు సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి.. మరోవైపు 2022, 2023 బ్యాచ్‌లకుq చెందిన గ్రాడ్యుయేట్స్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఫ్రెషర్స్‌గా పలు సాఫ్ట్‌వేర్ కంపెనీల నుంచి ఆఫర్ లెటర్స్ పొందారు. కానీ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియల్లో నిరంతర జాప్యాన్ని ఎదుర్కొంటున్నారు…

ఇక ఉద్యోగాలా మరో ఏడాదిలో ఇస్తామని చెప్పినా కూడా ఇప్పటికి ఉద్యోగాలు ఇవ్వలేదు.. నివేదిక ప్రకారం, కొంతమంది తమ ఆఫర్ లెటర్ల గడువు ముగింపు తేదీకి దగ్గరగా ఉన్న తర్వాత కూడా అదనపు శిక్షణ పొందవలసి వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఉద్యోగ ఆఫర్లు పూర్తిగా ఉపసంహరించబడ్డాయి.. దాంతో ప్రేషర్స్ కు ఉద్యోగాలు కష్టంగా మారిందని చెప్పాలి..ఆన్‌బోర్డింగ్ జాప్యం గురించి గత రెండు బ్యాచ్‌లలో 20,000-25,000 మంది విద్యార్థుల నుంచి ఉద్యోగుల సంఘం ఫిర్యాదులను అందుకుందని టాక్.. ఇకపోతే ఈ విషయం పై పలు చర్చలు కూడా జరుగుతున్నాయి..