రఘుబాబు ఓ నవ్వుల నావ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూన్ 24న నటుడు రఘుబాబు పుట్టినరోజు)
తెలుగు సినిమా రంగంలో తండ్రుల బాటలోనే సాగుతున్న తనయులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం అనేక చిత్రాలలో నవ్వులు పూయిస్తున్న రఘుబాబు కూడా తండ్రి గిరిబాబు లాగే చిత్రప్రయాణం సాగిస్తున్నారు. గిరిబాబు విలన్ గా, కామెడీ విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా, కమెడియన్ గా పలు చిత్రాలలో మురిపించారు. అదే తీరున రఘుబాబు సైతం ఆకట్టుకున్నారు. ఇప్పటికీ రఘుబాబును దృష్టిలో పెట్టుకొని పాత్రలు సృష్టిస్తున్న వారెందరో!
గిరిబాబు చిత్రసీమలో రాణిస్తున్న సమయంలోనే రఘుబాబు కూడా సినిమా రంగంలో అడుగుపెట్టాలనుకున్నారు. అయితే అతని తమ్ముడు బోసుబాబును హీరోగా పరిచయం చేయడంతో, తండ్రి నిర్మించే చిత్రాలకు ప్రొడక్షన్ చూసుకుంటూ సాగారు. తరువాత కొన్ని వ్యాపారాల్లోనూ చేయి పెట్టి దెబ్బ తిన్నారు. ఆ సమయంలో ఇక నటన తప్ప వేరే మార్గం కనిపించని రఘుబాబుకు మొదట్లో తిరస్కారాలు ఎదురయ్యాయి. అయితే అన్నిటినీ చిరునవ్వుతో ఓదార్చుకుంటూ అందిన ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకున్నారు. కొన్ని టీవీ సీరియల్స్ లోనూ నటించారు. ఆ పై ‘మురారి’, ‘ఆది’ చిత్రాలలో రఘుబాబుకు గుర్తింపు ఉన్న పాత్రలు లభించాయి. ఆ తరువాత నవ్వించడమూ అలవాటు చేసుకున్నారు. ఆయన కామెడీ జనాన్ని భలేగా ఆకట్టుకుంది.
Also Read
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఎందరెందరో కామెడీ పండించడానికి సై అంటూ వచ్చేస్తున్నారు. అయినా రఘుబాబు తనదైన నటనతో నవ్వుల నావ నడుపుకుంటూ చిత్రసాగరంలో ప్రయాణం సాగిస్తున్నారు. ఏ నాడయితే రఘుబాబు నవ్వులు పండించడం మొదలు పెట్టారో, ఆ తరువాత నుంచీ వెనుదిరిగి చూసుకోకుండా ముందుకు సాగుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఏడాదికి ఆరేడు సినిమాల్లో కనిపిస్తూనే రఘుబాబు అలరిస్తున్నారు. నవతరం హాస్యనటులు బయలు దేరుతున్నా, వారికీ గట్టిపోటినిస్తున్నారు రఘుబాబు. అందువల్లే దర్శకనిర్మాతలు, రచయితలు రఘుబాబు కోసమే అన్నట్టు ఏదో ఒక వైవిధ్యమైన పాత్రను క్రియేట్ చేసి, ఆయనను అందులో పరకాయప్రవేశం చేయిస్తున్నారు. అలా ప్రతీసారి రఘుబాబు మార్కులు సంపాదిస్తున్నారనే చెప్పాలి. గిరిబాబు ఏడు పదులు దాటినా ఇంకా దరిచేరిన పాత్రలను పోషిస్తున్నారు. రఘుబాబు కూడా అదే తీరున సాగుతారేమో చూడాలి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!