Salary Hike Time: కొత్త సంవత్సరం వచ్చి మూడు నెలలవుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం మరికొద్ది రోజుల్లో రాబోతోంది. ఈ సమయంలో ఉద్యోగులు తమ వేతనాలు ఏ మేరకు పెరుగుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఏప్రిల్ నుంచి కొత్త బడ్జెట్ అమల్లోకి రానుండటంతో కొన్ని ధరలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు శాలరీ హైక్ ఆశిస్తారు. పర్సనల్ ఫైనాన్సియల్ ప్లానింగ్ వేసుకుంటారు.
పెరిగే జీతాలు మార్చి నెల శాలరీతోపాటు ఇస్తారా లేక ఏప్రిల్ నెల వేతనంతో కలిపి ఇస్తారా అంటూ లెక్కలేసుకుంటారు. ఇదిలాఉంటే.. మరి.. సంస్థలు ఏం ఆలోచిస్తాయి?. జీతాలను 5 శాతం పెంచుతాయా? 10 శాతం పెంచుతాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలు సంస్థలు డిటెయిల్డ్‌గా స్టడీ చేశాయి. ఆ అధ్యయన ఫలితాలను బట్టి చూస్తే.. కంపెనీలు శాలరీలను పెంచే సమయంలో చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి.
read more: Airtel Vs Jio: జియో, ఎయిర్‌టెల్ మధ్య పోటీ. కస్టమర్ల కోసం ఆఫర్ల మీద ఆఫర్లు
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాయి. ముందుగా సంస్థ ఆర్థిక పరిస్థితితోపాటు దేశ ఆర్థిక పరిస్థితిని కూడా పరిశీలిస్తాయి. సమీప భవిష్యత్తులో దేశంలో ఆర్థికమాంద్యం వస్తుందా? కేంద్ర బ్యాంకు.. వడ్డీ రేట్లను పెంచుతుందా? ఒక వేళ ఇలాంటి పరిస్థితులే ఉంటే వేతనాల పెంపుపై ఎంత పరిమితి పెట్టాలి? అనే దిశగా యాజమాన్యాలు చూస్తాయి. కొన్ని సందర్భాల్లో లేఆఫ్‌లకు సైతం వెనకాడవు.
అదే సమయంలో.. మంచి ఉద్యోగులను వదులుకోవు. ట్యాలెంటెడ్ పీపుల్‌ని ఎంత బాగా వినియోగించుకోవాలా అని ప్రణాళికలు వేస్తాయి. అవసరమైతే.. శాలరీ హైక్‌తోపాటు ప్రమోషన్లు కూడా ఇస్తాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణ ప్రభావం కంపెనీ ఖర్చుల మీద పడకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతాయి. సంస్థ పనితీరు, సాధించిన లక్ష్యాలు, మార్కెట్‌లోని పోటీ వాతావరణం, ఉద్యోగుల వేతనాల్లోని అసమానతలు, టార్గెట్ ప్రమోషన్ రేట్, టర్నోవర్, నగదు నిల్వలు, చెల్లింపులు, కొత్త ఉద్యోగుల నియామకాలు, ఎక్కువ కాలంగా కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ తదితర అంశాలు వేతనాల పెంపు విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
అయితే.. ఇండియాలో యావరేజ్ శాలరీ హైక్.. టెన్ పర్సెంట్ ఉంటుందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. అమెరికా, జర్మనీ వంటి దేశాలతో పోల్చితే మన దేశంలోనే వేతనాల పెంపు ఎక్కువ శాతం ఉంటుందని పేర్కొంటున్నాయి. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, హైటెక్ సెక్టార్లలో శాలరీ హైక్ 9 పాయింట్ 8 శాతం ఉంటుందని కార్న్ ఫెర్రీ అనే సంస్థ తన సర్వేలో అంచనా వేసింది.
ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్ మీడియా, గేమింగ్, ఫార్మా, బయోటెక్, కెమికల్స్, రిటైల్ రంగాల్లో వేతనాల పెంపు ఎక్కువగా ఉంటుందని WTW సర్వే తెలిపింది. ఇ-కామర్స్, టెక్ ప్లాట్‌ఫామ్‌లు, ప్రొడక్ట్‌లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌లు, టెక్ కన్సల్టింగ్, సర్వీసులు, ఫైనాన్షియల్ సర్వీసులు, ఎఫ్‌ఎంసీజీ వంటి సెక్టార్లు సైతం ఈ ఏడాది అధిక వేతనాలను చెల్లిస్తాయని ఎయాన్ సర్వే వెల్లడించింది.
శాలరీ హైక్ విషయంలో.. కరోనా పీరియెడ్, వర్క్ ఫ్రం హోం, రిమోట్ అండ్ హైబ్రిడ్ వర్కింగ్ మోడల్స్ తదితర ఫ్యాక్టర్స్‌నీ పరిగణనలోకి తీసుకుంటారు. మేల్, ఫిమేల్ ఎంప్లాయీస్‌కి సమాన వేతనాలు, ఉన్నట్టుండి జాబ్ మానేయటం, మూన్‌లైటింగ్, ఫ్రీల్యాన్స్, గిగ్ వర్క్ వంటి అంశాలను కూడా పరిశీలిస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్‌గా.. ముఖ్యమైన అంశం ఏంటంటే.. వేతనం ఎప్పుడు పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది, ఎప్పుడు చేతికొస్తుందనేవి ఉద్యోగుల మనసులో మెదిలే టాప్ మోస్ట్ టాపిక్‌లైతే కావొచ్చు.
కానీ.. యాజమాన్యాలు కూడా ఇలాగే ఆలోచించాలనే రూలేమీ లేదు. కాబట్టి.. శాలరీ.. హైక్ అయినా కాకపోయినా మన పనేదో మనం చేసుకుపోవాలనే మైండ్‌సెట్‌ని ఎంప్లాయీస్ డెవలప్ చేసుకోవటం కెరీర్‌కి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు వస్తున్న వేతనానికి తగిన ఆర్థిక ప్రణాళికతో లైఫ్‌లో ముందుకు సాగాలని సూచిస్తున్నారు.