NTV Telugu Site icon

Bibi-Ka-Alam: ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం నుంచి కొత్త సంవత్సరం..

Muharam

Muharam

Bibi-Ka-Alam: మొహర్రం నెల ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి నెలగా ప్రారంభం అవుతుంది.. చంద్రుని దర్శనం తర్వాత ఈ పండుగ తేదీలు నిర్ణయిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు మొహర్రం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పదవ రోజును అశురా దినంగా పాటిస్తారు. (చాంద్రమానం ప్రకారం 2024 జూలై 17న) మొహర్రం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ పవిత్రమైన రోజున పీర్ల (పంజా)ని ప్రతిష్టించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అల్లా ఆరాధన సమయంలో బెల్లంతో చేసిన నైవేద్యాలు సమర్పిస్తారు. ‘మొహర్రం’ అంటే పండుగ రోజు కాదు. ఈ రోజు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటుంది. 14 శతాబ్దాల క్రితం ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటాన్ని ‘మొహరం’ అంటారు. అరబ్బులు పురాతన కాలంలో ఈ క్యాలెండర్‌ను ఉపయోగించారు.

Read also: CM Revanth Reddy: నేడు టీపీసీసీ కార్యవర్గ సమావేశం.. పార్టీ కార్యక్రమాలపై చర్చ..

చరిత్ర..

మహ్మద్ ప్రవక్త మరణానంతరం హజ్రత్ అబూబకర్ సిద్ధిక్, హజ్రత్ అలీ, హజ్రత్ ఉమర్ కూడా అద్భుతమైన పరిపాలన అందించారు. తరువాత, యాజిద్ తనను తాను ఖలీఫాగా ప్రకటించుకుని, క్రూరమైన పరిపాలన సాగించాడు. ఆ సమయంలో హజ్రత్ హుస్సేన్ తన రాక్షసత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాడారు. శాంతి కోసం హుస్సేన్ చేసిన ప్రతిపాదనలను యాజిద్ తిరస్కరించాడు.. యుద్ధం ప్రకటించాడు. ఆ యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త కుటుంబానికి చెందిన దాదాపు 70 మంది (షహీద్) అమరులవుతారు. అప్పుడు హజ్రత్ హుస్సేన్ ఆ తెగను శాపం పెడతాడు. వారికి ఎప్పటికీ మోక్షం ప్రసాదించవద్దని అల్లాను వేడుకుంటూ తన ప్రాణాలను విడిచిపెట్టాడు. యుద్ధం ముగిసిన తర్వాత యాజిద్ తెగ ప్రజలు పశ్చాత్తాపపడ్డారు.. అల్లా మేం తప్పు చేశాం.. మహమ్మద్ ప్రవక్త కుటుంబంలోని వ్యక్తులను చిత్రహింసలకు గురిచేసి చంపేశాం. మమ్మల్ని క్షమించండి అంటూ గుండెల మీద బాదుకుంటూ హల్చిద.. హల్చిద అని రక్తాలు చిందిస్తూ.. భభ మండే నిప్పులపై కాలికి పాదరక్షలు లేకుండా నిప్పు మీద నడుస్తారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం మొదలైంది.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Rajanna Sircilla: వారందరికి ఈనెల 27న రిలీవ్.. రాజన్న ఆలయ ఈవో కీలక ప్రకటన..