NTV Telugu Site icon

Is Shark Tank the next IPL: టీవీ ప్రోగ్రామ్‌ స్థాయి నుంచి బిజినెస్‌ లెవల్‌కి ఎదుగుతోందా?

Is Shark Tank the next IPL

Is Shark Tank the next IPL

Is Shark Tank the next IPL: క్రికెట్‌లో ఐపీఎల్‌ టోర్నీ ఎంత పెద్ద సక్సెస్‌ అయిందంటే.. ఆ బ్రాండ్‌ వ్యాల్యూ ఇప్పుడు 8 పాయింట్‌ 4 బిలియన్‌ డాలర్లకు చేరింది. అలాగే.. సోనీ టీవీలో ప్రసారమవుతున్న షార్క్ ట్యాంక్ ఇండియా రియాల్టీ షో పాపులారిటీని, వ్యూవర్‌షిప్‌ని చూస్తుంటే అది మరో ఐపీఎల్‌ కాబోతోందా అనిపిస్తోంది. ఐపీఎల్‌ మాదిరిగానే షార్క్‌ ట్యాంక్‌ ఇండియాకు కూడా తనకంటూ ఒక బ్రాండ్‌ వ్యాల్యూని గ్రాండ్‌గా డెవలప్‌ చేసుకునే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. టీవీ ప్రోగ్రామ్‌ స్థాయి నుంచి ఒక బిజినెస్‌ రేంజ్‌కి ఎదుగుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి పలు ఉదాహరణలను వివరిస్తున్నారు.

ప్రస్తుతం షార్క్‌ ట్యాంక్‌ ఇండియా సెకండ్‌ సీజన్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్‌ సీజన్‌లో మొత్తం 35 ఎపిసోడ్‌లు ప్రసారమయ్యాయి. వాటి ద్వారా 67 బిజినెస్‌లకు ఫండ్‌ రైజింగ్‌ జరిగింది. 42 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో గత నెల రోజుల్లో మన దేశంలోని ఇతర టీవీ షోల యావరేజ్‌ ఆడియెన్స్‌ డిమాండ్‌తో పోల్చుకుంటే ఈ రియాల్టీ షోకి 6 పాయింట్‌ 8 రెట్లు ఎక్కువ డిమాండ్‌ ఏర్పడింది. ఈ మార్కెట్‌లోని అన్ని షోలను లెక్కలోకి తీసుకున్నా కూడా 8 పాయింట్‌ 6 శాతం షోలకే ఈ స్థాయి డిమాండ్‌ రావటం షార్క్‌ ట్యాంక్‌ ఇండియా రియాల్టీ షో ప్రాధాన్యతను తెలియజేస్తోంది.

read more: Cinema Theatres: ప్రతి ముగ్గురిలో ఒకరి చూపు థియేటర్‌ వైపు

షార్క్‌ ట్యాంక్‌ ఇండియా రియాల్టీ షోలో పాల్గొంటున్న ఇన్వెస్టర్ల వ్యాపారాలు ఈమధ్య కాలంలో ఏ లెవల్‌లో లాభాలను గడిస్తున్నాయో తెలుసుకుంటే చాలు ఇది ఎంత పెద్ద సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ వెంచర్‌గా మారబోతోందో అర్థమవుతుంది. ముందుగా.. ఈ రియాల్టీ షోకి ఆదాయం తెచ్చిపెడుతున్న వనరుల గురించి చెప్పుకుందాం. షార్క్‌ ట్యాంక్‌ ఇండియా ప్రసార హక్కుల ధరలు గణనీయంగా పలుకుతున్నాయి. వ్యూవర్‌షిప్‌ ఎక్కువగా ఉండటంతో బ్రాండ్ల ద్వారా మరియు అడ్వర్టైజర్ల ద్వారా వచ్చే రెవెన్యూ భారీగా ఉంటోంది.

షార్క్‌ ట్యాంక్‌ ఇండియా రియాల్టీ షో రెండు సీజన్‌లను కూడా సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా ఒక్కటి మాత్రమే డిస్ట్రిబ్యూట్‌ చేస్తోంది. కాబట్టి ఈ పంపిణీ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం సోనీకే సొంతం. ఫస్ట్‌ సీజన్‌కి ప్రకటనకర్తల నుంచి అద్భుతమైన స్పందన రావటం వల్ల దాంతో పోల్చుకుంటే రెండో సీజన్‌కి ఇప్పటికే మూడు రెట్లు ఎక్కువ రెవెన్యూ జనరేట్‌ అయిందని సోనీ తెలిపింది. అయితే డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా కరెక్ట్‌గా ఎంత ఆదాయం వచ్చిందనే విషయాన్ని మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు.

వ్యూవర్‌షిప్‌ విషయానికొస్తే.. షార్క్‌ ట్యాంక్‌ ఇండియా రియాల్టీ షో సెకండ్‌ సీజన్‌.. ముందస్తు అంచనాలను మించుతుండటం విశేషం. మిగతా రియాల్టీ షోలన్నింటి కన్నా దీనికి 99 పాయింట్‌ 7 శాతం ఎక్కువ డిమాండ్‌ నెలకొనటం గమనించాల్సిన అంశం. షార్క్‌ ట్యాంక్‌ ఇండియాకి మరో ఇన్‌కం సోర్స్‌ స్పాన్సర్‌షిప్‌లు. ఈ షోని స్పాన్సర్‌ చేస్తున్న సంస్థల జాబితాలో UpGrad, ACKO, Cashfree Payments, Smallcase, FiMoney, Flipkart, Dell Technologies, Pokerbaazi, EatFit, Lenskart మరియు Apollo 24/7 వంటి దిగ్గజ సంస్థలు ఉండటం గొప్ప విషయం.

షార్క్‌ ట్యాంక్‌ ఇండియా రియార్టీ షోకి వస్తున్న ఆదాయంలో స్పాన్సర్‌లతోపాటు ప్రకటనలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ షో రెండో సీజన్ ప్రారంభానికి 10 రోజుల ముందే ‘‘యాడ్‌ ఇన్వెంటరీలో’’ 75 శాతానికి పైగా విక్రయించినట్లు సోనీ ఛానల్ ప్రకటించటం ప్రస్తావించాల్సిన అంశం. షార్క్ ట్యాంక్ రియాల్టీ షోకి ఇండియాతోపాటు ఇతర దేశాల్లో కూడా పలు వెర్షన్లు ప్రసారమవుతున్నాయి. వాటితోపాటు షార్క్ ట్యాంక్ రియాల్టీ షో కాన్సెప్ట్‌ని పోలిన ప్రోగ్రామ్‌లు సైతం దండిగా ఆదాయం తెచ్చిపెడుతున్నాయి.

షార్క్‌ ట్యాంక్‌ ఇండియా రియాల్టీ షోలో పాల్గొనే ఎంట్రప్రెన్యూర్లకు ఇన్వెస్టర్ల నుంచి ఫండ్‌ రైజ్‌ అవుతుందా లేదా అనే అంశాన్ని పక్కన పెడితే.. వాళ్లు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనటం ద్వారా తమ వ్యాపారానికి ఫ్రీగా పబ్లిసిటీ పొందుతున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారటం, పర్సనల్‌ బ్రాండ్‌ వ్యాల్యూ పెరగటం, తద్వారా వాళ్ల కంపెనీల ప్రొడక్టుల సేల్స్‌ వృద్ధి చెందటం వంటివి చోటుచేసుకుంటున్నాయి. దీనికి చక్కని ఉదాహరణగా హ్యామర్‌ లైఫ్‌స్టైల్స్‌ బిజినెస్‌ గురించి చెప్పుకోవచ్చు.

ఈ సంస్థ ప్రతినిధులు షార్క్‌ ట్యాంక్‌ ఇండియా రియాల్టీ షో ఫస్ట్‌ సీజన్‌లో పాల్గొన్నారు. అప్పుడు వాళ్ల కంపెనీ ఉత్పత్తుల అమ్మకాల ద్వారా నెలకు 70 లక్షల రూపాయల ఆదాయం వచ్చేది. అవి ఇప్పుడు ఏకంగా 2 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఈ అనుభవం.. ఒకటీ రెండు సంస్థలకే పరిమితం కాలేదు. షార్క్‌ ట్యాంక్‌ ఇండియా రియాల్టీ షోలో పాల్గొన్న దాదాపు ప్రతి సంస్థకూ ఎదురైంది. ఈ కార్యక్రమం విజయవంతం కావటం స్టార్టప్స్‌పై ప్రజలు అమితాసక్తి చూపుతున్నారనటానికి, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ కాన్సెప్ట్‌ పట్ల సోసైటీ యాక్సెప్టెన్సీ పెరుగుతోందనటాకి నిదర్శనాలుగా పేర్కొనొచ్చు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే.. షార్క్‌ ట్యాంక్‌ ఇండియా రియార్టీ షో.. తన ట్యాగ్‌లైన్‌ను, తన లక్ష్యాన్ని మాటల్లో కాకుండా ఆచరణలో చేసి చూపిస్తోంది. ఇంతకీ ఈ ప్రోగ్రామ్‌ ట్యాగ్‌ లైన్‌ ఏంటంటే.. ‘‘ఇప్పుడు భారతదేశం మొత్తం వ్యాపారం యొక్క నిజమైన విలువను అర్థంచేసుకుంటుంది’’. “Ab pura India, business ki sahi value samjhega!”.