Indian Workforce After Covid: మన దేశంలో ఎంప్లాయ్‌మెంట్ గత రెండేళ్లలో బాగా ఎక్స్ఛేంజ్ అయింది. అంటే.. ఉపాధి మార్కెట్‌లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. కొవిడ్ అనంతరం వర్క్‌ఫోర్స్ తగ్గినప్పటికీ క్వాలిటీ జాబ్స్ పెరిగాయి. ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ నిర్వహించిన కొత్త సర్వేలో ఈ విషయం తేలింది. ఈ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం.. కరోనా కన్నా ముందు నాటి పరిస్థితులతో పోల్చితే ఇప్పుడు ఎక్కువ శాలరీ ఇచ్చే ఉద్యోగాలు అధికంగా అందుబాటులోకి వచ్చాయి.
సెప్టెంబర్.. అక్టోబర్.. ఈ రెండు నెలల్లో 85 లక్షల కొలువులు జాబ్ మార్కెట్‌కి అదనంగా చేరాయి. సెప్టెంబర్ నాటికి మొత్తం ఉద్యోగాల సంఖ్య 8 కోట్ల 60 లక్షలకు చేరగా అక్టోబర్‌కి వచ్చే నాటికి 13 లక్షలు తగ్గి.. 8 కోట్ల 47 లక్షలకు చేరాయి. అయినప్పటికీ.. కొవిడ్-19 ప్రారంభం తర్వాత ఏ నెలలోనూ ఇన్ని ఉద్యోగాలు నమోదుకాకపోవటం విశేషం.
read also: Ambani Vs Adani: అంబానీ ‘‘కిరీటం’’ అదానీకి
ఈ జాబుల్లో ఎక్కువ శాతం లిస్టెడ్ కంపెనీలు సృష్టించినవే కావటం ఆసక్తికరమని ఈ సర్వే సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా మరియు సీఈఓ మహేష్ వ్యాస్ అభిప్రాయపడ్డారు. వేతనం ఇచ్చే ఉద్యోగాలతో పోల్చితే లిస్టెడ్ కంపెనీల్లో వేతనాలు దాదాపు మూడు రెట్లు ఎక్కువని అన్నారు.
2021-22లో లిస్టెడ్ కంపెనీల్లో ఏడాదికి యావరేజ్ శాలరీ 7 లక్షల రూపాయలకు పైగానే ఉండగా వేతనం ఇచ్చే ఉద్యోగాల్లో సంవత్సరానికి వచ్చే శాలరీ 2 లక్షల 63 వేల రూపాయలు మాత్రమేనని వ్యాస్ చెప్పారు. అయితే.. ఈ వేతనం ఇతర ఉద్యోగాలు చేసేవారి కన్నా కూడా కొంచెం ఎక్కువేనని తెలిపారు.
ఒక బిజినెస్ పర్సన్ ఏడాదికి లక్షా 34 వేల 323 రూపాయల శాలరీ మాత్రమే పొందుతుండగా చిన్న వ్యాపారులు మరియు దినసరి కూలీలకు సంవత్సరానికి లక్షా 17 వేల 53 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. రైతులకైతే ఈ రాబడి ఇంకా తక్కువని మహేష్ వ్యాస్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. వ్యవసాయ రంగం మరియు వ్యక్తిగత సేవల రంగంలో జాబులు తగ్గటం వల్ల ఒక రకంగా మంచే జరిగినట్లు క్రెడిట్ సూయిస్ అభిప్రాయపడింది. మహమ్మారి ముందు నాటి పరిస్థితులతో పోల్చితే ప్రస్తుతం కార్మిక భాగస్వామ్యం రేటు సెప్టెంబర్‌లోని 39 పాయింట్ 3 శాతం నుంచి అక్టోబర్‌లో స్వల్పంగా 39 శాతానికి పడిపోయింది. దీనికి తగ్గట్లు నిరుద్యోగిత రేటు 6 పాయింట్ 4 శాతం నుంచి 7 పాయింట్ 8 శాతానికి పెరిగింది.
అదే సమయంలో.. పరిశ్రమల్లో ఉద్యోగాల సంఖ్య పెరిగింది. 2019 అక్టోబర్ నాటి గణాంకాలతో పోల్చి ఈ అంచనాకు వచ్చారు. వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గటాన్ని పాజిటివ్‌గా పరిగణనలోకి తీసుకోవాలని క్రెడిట్ సూయిస్ సూచించింది. ఇది.. ‘‘హిడెన్ అన్‌ఎంప్లాయ్‌మెంట్’’ కావటమే ఇందుకు కారణమని పేర్కొంది. సర్వీస్ సెక్టార్ జాబ్స్‌లో ఎక్కువగా పర్సనల్ సర్వీస్‌లకు సంబంధించిన ఉద్యోగాలు తగ్గాయని వెల్లడించింది.
మరో వైపు.. రూరల్ ఎంప్లాయ్‌మెంట్‌పై విశ్లేషణ జరిపిన మోర్గాన్ స్టాన్లీ.. మరిన్ని ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చింది. లేబర్ మార్కెట్ పరిస్థితులు, గ్రామీణ రంగంలోని వాణిజ్య స్థితిగతులు మెరుగుపడుతున్నాయని గుర్తించింది. వేతనం ఇచ్చే ఉద్యోగాల్లో అత్యధికం.. అంటే.. ఏకంగా 63 శాతం పట్టణ మార్కెట్ల నుంచే అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. ఈ మేరకు.. గతేడాదికి సంబంధించిన డేటాను ప్రస్తావించింది.
ఎంప్లాయ్‌మెంట్, క్రెడిట్ ఆఫ్‌టేక్, ఆటోమొబైల్ సేల్స్ మరియు వాణిజ్యం.. ఈ నాలుగు కీలక సూచికలు పుంజుకోవటానికి సిద్ధంగా ఉన్నాయని పరిశోధన సంస్థ పేర్కొంది. కొవిడ్-19 అనంతరం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పొందినవారి సంఖ్య కూడా అత్యల్పమేనని క్రెడిట్ సూయిస్ స్పష్టం చేసింది.
మరీ ముఖ్యంగా.. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో 11 కోట్ల 80 లక్షల మంది దినసరి కూలీలు మరియు చిన్న వ్యాపారులు ఉపాధికి దూరమయ్యారని, వీళ్లల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సర్వే పేర్కొంది.