NTV Telugu Site icon

Financial Advises: ఆర్థికంగా పైకి రావాలంటే ఏం చేయాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?

Financial Advises

Financial Advises

Financial Advises: కేవలం శాలరీతోనే ఎవరూ సంపన్నులైపోరు. ఆర్థికంగా పైకి రావాలంటే ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. ఇండియాలోనే ‘ది బెస్ట్‌’, యూనిక్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ ఏదీ అంటే మ్యూచువల్ ఫండ్ అని చెప్పొచ్చు. ఇందులో ముందుగా ఒక వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టారనుకుందాం. ఆ అమౌంట్‌ని ఒక ప్రొఫెషనల్‌ మేనేజర్‌ ఆధ్వర్యంలో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.

అతను ఆ డబ్బును టాప్‌-30 కంపెనీల్లోకి మళ్లిస్తే.. అప్పుడు మనం ఇన్‌డైరెక్టుగా ఆ టాప్‌-30 సంస్థల్లో పార్ట్నర్‌గా మారే గొప్ప అవకాశం వస్తుంది. మార్కెట్‌లో పెట్టే ఈ పెట్టుబడిపై ద్రవ్యోల్బణ ప్రభావం ఉండదు కాబట్టి మనకి ఎక్కువ మొత్తం తిరిగొస్తుంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌లో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఎప్పుడైనా తీసేసుకోవచ్చు.

read more: Increments in India: భారతీయ సంస్థల్లో ఈ ఏడాది వేతనాల పెంపు పరిస్థితిపై సర్వే

కేవలం ఒకే ఒక పెట్టుబడి పథకంతో సెక్షన్‌-80సీ కింద పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు. ఇందులో వంద శాతం పారదర్శకత ఉంటుంది. బ్యాంకులను ఆర్‌బీఐ ఎలాగైతే నియంత్రిస్తుందో అలాగే మ్యూచువల్‌ ఫండ్స్‌ని సెబీ రెగ్యులేట్‌ చేస్తుంది. ఈ రోజు మనం.. ఫండ్స్‌, వాటిలోని రకాల గురించి డిస్కస్‌ చేద్దాం. 1. ఈక్విటీ ఫండ్స్‌ 2. డెట్‌ ఫండ్స్‌ 3. ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్.

ఈక్విటీ ఫండ్స్‌లో టాప్‌-100 కంపెనీలను లార్జ్‌ క్యాప్ అని, 101 నుంచి 250 వరకు ఉన్న కంపెనీలను మిడ్‌ క్యాప్‌గా పేర్కొంటారు. టాప్‌-251 మరియు ఆ తర్వాత ఉన్న సంస్థలను స్మాల్‌ క్యాప్‌ అంటారు. నెక్‌స్ట్‌ ఎపిసోడ్‌లో ఈక్విటీ ఫండ్స్‌ మరియు వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఈ విషయాలను మరింత వివరంగా తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న వీడియో చూడొచ్చు. ఇందులో ఫైనాన్షియల్‌ ఎక్స్‌పర్ట్‌ యూఎల్‌ శ్రీనివాస్‌ ఎన్నో విలువైన సలహాలు సూచనలు అందించారు. ఆ వీడియో మీకోసం..

Show comments