NTV Telugu Site icon

Huge Rat: జీవితంలో ఇంత పెద్ద ఎలుకను ఎప్పుడూ చూసి ఉండరు

New Project (26)

New Project (26)

Huge Rat: సాధారణంగా భారతదేశంలో రైతుల పాలిట ఎలుకలే ప్రధాన శత్రువులు. మామూలుగా ఎలుకలు భారీగా అంటే 15సెం.మీ పొడవు, కేజీ బరువు ఉంటాయి. కానీ ఎప్పుడైనా 4అడుగుల పొడవు, 80కేజీల బరువున్న ఎలుక గురించి విన్నారా. అయితే ప్రస్తుతం అలాంటి ఎలుక వీడియో ఒకటి వైరల్ అవుతూ అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ ఎలుకను చూస్తే పిల్లి కంటే పెద్దది. ఇంత పెద్ద ఎలుక ఎక్కడ దొరుకుతుందని మీరు ఆశ్చర్యపోవచ్చు.

Read Also: Srinivas Goud: హైదరాబాద్‌కు చేరుకున్న నిఖత్‌ జరీన్‌.. స్వాగతం పలికిన శ్రీనివాస్‌గౌడ్‌

సోషల్ మీడియాలో పెద్ద ఎలుక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వీడియోలో మీరు ఒక వ్యక్తి పెద్ద జంతువును ఎత్తడం చూడవచ్చు. అతను దానిని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత, దాని ఆకారం కుక్క, పిల్లిలా అనిపించింది. కానీ నిశితంగా పరిశీలిస్తే అది ఎలుక. ఇది పిల్లులు, కుక్కల కంటే పెద్ద ఎలుక. @OTerrifying అనే ట్విట్టర్ ఖాతాలో వీడియో పోస్ట్ చేయబడింది. ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ ఎలుక అంత పెద్దది ఎలా అయిందని చాలా మంది ఆశ్చర్యపోయారు.

Read Also: Experimental film: సింగిల్ క్యారెక్టర్ తో ‘హలో మీరా’!

సమాచారం ప్రకారం, కాపిబారా ఎలుక జాతికి చెందిన జంతువు. ఇది 4 అడుగుల పొడవు ఉంటుంది. దీని బరువు 80 కిలోల వరకు ఉంటుంది. ఈ వీడియోలో ఉన్న ఎలుక గురించి ఎవరికి పెద్దగా తెలియదు. ఈ ఎలుక ఎక్కడ కనిపించిందన్న సమాచారం లేదు. ఒక నెటిజన్ ఈ వీడియోపై కామెంట్ చేసినప్పుడు ఇది న్యూయార్క్‌కు చెందినదని చెప్పారు.

Show comments