ఈరోజుల్లో వయస్సు తో సంబంధం లేకుండా అద్భుతాలు సృష్టిస్తున్నారు.. ఆలోచనలకు వయస్సుతో సంబంధం లేదు.. ఏ వయస్సు వారైనా వినూత్న ఆవిష్కరణలు సృష్టించవచ్చు అని నిరూపించాడు ఓ అరవై ఏళ్ల వృద్ధుడు.. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి సైకిల్ ను మోటారు సైకిల్ గా మార్చి తన కష్టాన్ని సులభతరం చేసుకున్నాడు. టాలెంటు ఎవరి అబ్బ సొత్తు కాదు అని నిరూపించిన చంద్రం అనే చిరు వ్యాపారిని చూసి నేటి యువత ఆశ్చర్యపోతుంది. అతని గురించి మరిన్ని వివరాలు..
తెలంగాణాలోని సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక మండలం హబ్బీపూర్ గ్రామానికి చెందిన పబ్బం చంద్రం అనే 60 సంవత్సరాలు వృద్దుడు. తనకు ఉన్న సైకిల్ పై ఊరూరా తిరుగుతూ చిన్నపిల్లలకు సంబంధించిన కురుకురే, బింగో లాంటి తినుబండారాలను కిరాణా షాపులకు వేసి వచ్చిన దాంట్లో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.. గత ముప్పై ఏళ్ల నుంచి ఆయన ఇదే పని చేస్తున్నాడు.. కానీ ప్రస్తుతం వయసు మీద పడడం శరీరం ఆరోగ్యం సహకరించకపోవడంతో, కుటుంబ పరివారం పెరగడంతో కష్టపడలేక పోతున్నాడు. చనిపోయే వరకు తన రెక్కల కష్టంతోనే బ్రతకాలి అన్న ఆయన ఆశయం నుంచి ఒక తెలివైన ఉపాయాన్ని కనుక్కున్నాడు. ఆయన ఆలోచనలో నుంచి వచ్చిందే బ్యాటరీ సైకిల్.. మొదట్లో అందరూ ఇతనిని చూసి నవ్వారు.. కానీ ఇప్పుడు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు..
తన తెలివితో కేవలం 22వేల రూపాయలతో బ్యాటరీతో నడిచే సైకిల్ ని తయారుచేశాడు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 60 కిలోమీటర్లు వెళ్లే లాగా రూపొందించాడు. ప్రస్తుతం అతను ఈ బ్యాటరీ సైకిల్ పై ఊరు తిరుగుతూ తన జీవనాధారాన్ని కొనసాగిస్తున్నాడు.. తన కుటుంబ పోషణకు ఇక డోకా లేకుండా చూసుకుంటున్నాడు. అందుకే తెలివి ఎవడి అబ్బా సొత్తు కాదు, తలుచుకుంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు అని పెద్దాయన.. ఆర్థిక సాయం అందిస్తే ఇలాంటివి తయారు చేస్తామని ఆ వృద్ధుడు చెబుతున్నాడు.. నిజంగా ఆయన ఆలోచన గ్రేట్ కదా..
