Site icon NTV Telugu

Contact Lenses: కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారా.. బీ కేర్ ఫుల్

Contact Lense

Contact Lense

Contact Lenses: ప్రస్తుతం కంప్యూటర్లు, మొబైల్స్ వాడకం పెరిగిపోవడంతో ప్రజల దృష్టి తగ్గిపోతోంది. అందుకే చాలా మంది చిన్న వయసులోనే కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వస్తోంది. కళ్లద్దాలు తరచుగా వాడుతుంటే.. ముఖంపై మచ్చలు ఏర్పడి అందాన్ని పాడుచేస్తున్నాయి. అందుకే ప్రజలు కొన్నిసార్లు కళ్లద్దాలు ధరించకుండా ఉంటారు. అటువంటి పరిస్థితిలో, యువకులు కాంటాక్ట్ లెన్సులు ధరించే ధోరణి వేగంగా పెరిగింది. ఈ రోజుల్లో అందాన్ని కాపాడుకోవడానికి అద్దాలకు బదులు కాంటాక్ట్ లెన్సులు వాడుతున్నారు. అయితే దీనిని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

తాజాగా ఇలాంటి కాంటాక్ట్ లెన్స్ నిర్లక్ష్యం ఉదంతం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో నివసించే లో 21 ఏళ్ల మైఖేల్ మరిచిపోయి కాంటాక్ట్ లెన్స్‌లతో నిద్రపోయాడు. ఉదయం నిద్ర లేచి చూసేసరికి ఒక కంటికి చూపు పోయింది. మైక్ కన్నును ఫ్లాష్ అనే పరాన్న జీవి తినేసింది. దీని వలన అతను తన దృష్టిని కోల్పోయాడు. మైక్ యొక్క చిన్న అజాగ్రత్త అతనిని చాలా నష్టపరిచింది. అందుచేత కాంటాక్ట్ లెన్స్ వాడే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెల్సుకుందాం.

Read Also: Off The Record: గన్నవరం రగడతో పక్కకు పోయిన చర్చ ఏంటి..?

కాంటాక్ట్ లెన్స్‌లు ధరిస్తే తప్పకుండా నిద్రపోయే ముందు వాటిని తీసేయాలి. అలాగే నిద్రపోతే కళ్లలో ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువ కాలం కాంటాక్ట్ లెన్స్‌లు ధరించవద్దు. ఉపయోగించిన వెంటనే వాటిని తీసేసి కళ్లను శుభ్రం చేసుకోవాలి. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండడం మంచింది. దీని సుదీర్ఘ ఉపయోగం కళ్ళకు చాలా హానికరం.

మీరు కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగిస్తుంటే.. క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి. లెన్స్ మీ కళ్లకు సరిపోతుందో లేదో ఎప్పటికప్పుడు వారితో చెక్ చేసుకోండి. లెన్స్‌ల గడువు తేదీ గురించి జాగ్రత్తగా ఉండండి. గడువు ముగిసిన లెన్స్‌లు ఎప్పుడూ హానికరమే. వాటిని శుభ్రం చేయడానికి కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగిస్తున్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి. దీని కోసం, లెన్స్‌లను వేడి చేసి చల్లార్చిన నీటితో క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. లెన్స్‌లను శుభ్రం చేసేముందు, వాడే ముందు మీ చేతులను బాగా కడగాలి.

Read Also: Off The Record: గంటా, అయ్యన్నల మధ్య రాజకీయ సెగలు.. కట్టడి సాధ్యమా?

లెన్స్‌ను కంటిలో పెట్టేటప్పుడు పొరపాటున నేలపై పడితే, అలాగే కంటిలో పెట్టవద్దు. ఎందుకంటే నేలపై పడటం ద్వారా అనేక రకాల క్రిములు అందులోకి చేరి కంటి ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. ఈత కొట్టేటప్పుడు, కంటి ఇన్ఫెక్షన్, తలనొప్పి, మంటల చుట్టూ ఉన్నప్పుడు కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగించకూడదు. అలాగే, రైడింగ్ చేసేటప్పుడు కాంటాక్ట్ లెన్స్‌లు ధరించినట్లయితే సన్ గ్లాసెస్, హెల్మెట్ ధరించడం మర్చిపోవద్దు.

లెన్స్‌ను కంటిలో పెట్టే ముందు, ఉపయోగించిన తర్వాత ఎల్లప్పుడూ ద్రావణంతో శుభ్రం చేయండి. అలాగే, లెన్స్‌లు వేసుకున్న తర్వాత మీకు మంట లేదా మరేదైనా సమస్య అనిపిస్తే దానిని నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Exit mobile version