Lightning Strikes: ఆకాశంలో విమానంపై పిడుగు పడితే ఏమవుతుందో తెలుసా? ఆసక్తికర నిజాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lightning Strikes: థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి బెంగళూరు వస్తున్న అకాసా ఎయిర్‌లైన్స్ (QP 624) విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణంలో ఉండగా విమానంపై పిడుగు పడటంతో పైలట్లు అప్రమత్తమై, విమానాన్ని అత్యవసరంగా చెన్నైకి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే, ఆధునిక సాంకేతికత వల్ల విమానాలు పిడుగుపాటును ఎలా తట్టుకుంటాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Nara Lokesh : ఇది తెలుగుదేశం పార్టీ 3.O వర్షన్
Also Read
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
ఏడాదికి ఒకసారి ప్రతి విమానంపై పిడుగు పడుతుందా..
నిపుణుల అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వాణిజ్య విమానంపై ఏడాదికి కనీసం ఒక్కసారైనా పిడుగు పడుతుంది. ఉరుములు, మెరుపుల మధ్య ప్రయాణించేటప్పుడు ఇది చాలా సాధారణ విషయం. కానీ, ఇంజనీరింగ్ అద్భుతాల వల్ల విమానాలు గాలిలో ఒక ‘రక్షణ కవచం’లా పనిచేస్తాయి. సాధారణంగా మెరుపు విమానం యొక్క ముక్కు (Nose) లేదా రెక్కల కొనల వంటి పదునైన భాగాలను తాకుతుంది. ఆ విద్యుత్ విమానం బయటి బాడీ గుండా ప్రయాణించి తోక భాగం నుండి బయటకు వెళ్లిపోతుంది. ఆ సమయంలో విమానం లోపల ఉన్న వారికి ఒక పెద్ద ‘బాంగ్’ శబ్దం వినిపించడం లేదా ప్రకాశవంతమైన వెలుగు కనిపించడం జరుగుతుంది. పిడుగు కారణంగా విమానం లోపల ఉన్న వారికి విద్యుదాఘాతం (Electric Shock) తగలదు. ఎందుకంటే విమానం బాడీ విద్యుత్తును లోపలికి రానివ్వదు.
విమానాన్ని రక్షించేది ఇదే..
విమానాలు సురక్షితంగా ఉండటానికి భౌతిక శాస్త్రంలోని ‘ఫారడే కేజ్’ సూత్రం ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు. పాత విమానాలు అల్యూమినియంతో తయారవుతాయి. ఇది విద్యుత్ వాహకం కావడంతో మెరుపును బయటి పొరకే పరిమితం చేస్తుంది. బోయింగ్ 787 లేదా ఎయిర్‌బస్ A350 వంటి విమానాలు కార్బన్ ఫైబర్‌తో తయారవుతాయి. ఇవి విద్యుత్తును ప్రసరింపజేయవు కాబట్టి, వీటి బాడీ లోపల ప్రత్యేకంగా రాగి జాలీ పొరను అమర్చుతారు. ఇది విద్యుత్తును సురక్షితంగా బయటకు పంపుతుంది. రెక్కల్లో ఉండే ఇంధనం వద్ద మంటలు చెలరేగకుండా ఉండేందుకు ట్యాంక్ చుట్టూ మందపాటి లోహపు పొరను, కీళ్ల వద్ద ప్రత్యేక సీలింగ్‌ను ఉపయోగిస్తారు. విమానం రెక్కల వెనుక భాగంలో చిన్న కడ్డీలు లేదా సూదుల్లాంటివి కనిపిస్తాయి. వీటిని ‘స్టాటిక్ డిశ్చార్జర్లు’ అంటారు. విమానంపై పేరుకుపోయిన అదనపు విద్యుత్ ఆవేశాన్ని ఇవి నిరంతరం గాలిలోకి విడుదల చేస్తూ, పిడుగు పడే అవకాశాన్ని తగ్గిస్తాయి.
సంక్షోభంలో పైలట్ల పాత్ర
పిడుగు పడినప్పుడు పైలట్లు ఏమాత్రం భయపడకుండా కొన్ని చర్యలు తీసుకుంటారు. ఒక వేళ ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంపై పిడుగు పడితే పైలట్లు వెంటనే నావిగేషన్, కమ్యూనికేషన్, ఇంజిన్ కంట్రోల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేస్తారు. తుఫాను తీవ్రతను రాడార్‌లో గమనిస్తూ సురక్షిత మార్గంలోకి విమానాన్ని మళ్లిస్తారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఇంజినీర్లు బాడీపై ఎక్కడైనా చిన్న రంధ్రాలు లేదా కాలిన గుర్తులు ఉన్నాయేమో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. 1963 తర్వాత విమానాల భద్రతా ప్రమాణాలు అత్యంత కఠినతరం కావడంతో, గత 60 ఏళ్లలో పిడుగుపాటు వల్ల ఎటువంటి పెద్ద విమాన ప్రమాదాలు జరగలేదు. అకాసా ఎయిర్ ఘటనలో కూడా సాంకేతికత, పైలట్ల సమయస్ఫూర్తి వల్ల ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
READ ALSO: China: సముద్రగర్భంలో చైనా ‘సైనిక’ వేగులు.. అమెరికా స్థావరాలే టార్గెట్!
తాజావార్తలు
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!