Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Tdp 3 0 Version Nara Lokesh Party Reforms My Tdp App

Nara Lokesh : ఇది తెలుగుదేశం పార్టీ 3.O వర్షన్

Published Date :March 24, 2026 , 8:47 pm
By Gogikar Sai Krishna
  • పార్టీలో సమూల మార్పులు తీసుకువచ్చి పటిష్టంగా ముందుకు తీసుకువెళ్తాం
  • క్షేత్రస్థాయిలో పనిచేసే వారిని నేరుగా గుర్తించాలనేదే మా లక్ష్యం
  • పార్టీ ఆవిర్భావం దినోత్సవంలో బాగాపనిచేసిన 19 మంది కార్యకర్తలకు వేదికపై అవకాశం
  • టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్ లతో ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం
Nara Lokesh : ఇది తెలుగుదేశం పార్టీ 3.O వర్షన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇది టీడీపీ 3.O వర్షన్. పార్టీలో సమూల మార్పులు తీసుకువచ్చి ఇంకా పటిష్టంగా ముందుకు తీసుకువెళ్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్ లకు శిక్షణా తరగతుల్లో భాగంగా ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ లాంటిది. ఎంతోమంది గొప్ప నాయకులను తెలుగుదేశం పార్టీ తయారుచేసింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి తెలుగుదేశం యూనివర్సిటీనే, రెండో ముఖ్యమంత్రి కూడా తెలుగుదేశం యూనివర్సిటీనే. తెలుగుదేశం పార్టీ నాయకులను తయారుచేసే కార్ఖానా. గతంలో గండిపేటలో నిరంతరం పార్టీ శిక్షణ తరగతులు జరిగేవి. చాలా మంది ఉపముఖ్యమంత్రులు అయినవారు ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అయినవారు ఉన్నారు. ఇప్పుడు ఏడాదిలో కనీసం 300 రోజులు పార్టీ శిక్షణ తరగతులు జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మేం మీకు పదవులు ఇస్తున్నాం, కానీ ఏం చేయాలో చెప్పడం లేదు. చాలామందికి వారి బాధ్యతలు ఏంటో తెలియవు. వేటి ఆధారంగా పార్టీ తమను గుర్తిస్తుందో చాలామందికి తెలియదు. ఈ శిక్షణ తరగతుల ద్వారా వారికి అవగాహన వస్తుంది.

Iran: అలీ లారిజానీ స్థానం భర్తీ.. కొత్త భద్రతా చీఫ్‌గా బఘేర్ నియామకం

Also Read

  • CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
  • Hundi Income: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. కళ్లు చెదిరే ఆదాయం..
  • Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
  • AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు

పార్టీలో పనిచేసే వారిని గుర్తించేందుకు యాప్ తీసుకువచ్చాం. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం వల్ల పనిచేసేవారిని, చేయనివారిని గుర్తించవచ్చు. ఓవైపు శిక్షణ తరగతులు, మరోవైపు ‘మై టీడీపీ’ యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాం. ఓ కార్యక్రమానికి పిలుపునిస్తే దానిని సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 2019 నుంచి 2024 వరకు మనల్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. అక్రమ కేసులు పెట్టారు. దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయంపైనే దాడి చేశారు. ఏ తప్పూ చేయని చంద్రబాబు గారిని 53 రోజుల పాటు రాజమండ్రి జైలులో బంధించారు. దీంతో అందరం ఉద్యమించాం. ఆ ఉద్యమం వల్లే దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 94శాతం సీట్లు కూటమి కైవసం చేసుకుంది. వైసీపీని 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారు. ఇందుకు వారి అహంకారమే కారణం. నాకు రాష్ట్రంలో మూడో అత్యధిక మెజార్టీ వచ్చిందని అహంకారానికి పోకూడదు. అందరినీ కలుపుకొని పోవాలి. కులాలకు అతీతంగా అందరూ నాకు ఓటేశారు కనుకనే అంత మెజార్టీ వచ్చింది. నాపై బాధ్యత పెరిగింది. నా పనులు సక్రమంగా చేస్తున్నాను. దీనిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు అహంకారాన్ని ఒప్పుకోరు. అది గమనించాలి.

తెలుగుదేశం పార్టీలో క్లస్టర్లది చాలా కీలకపాత్ర. యూనిట్, బూత్ లను సమర్థంగా నడిపించగల వ్యక్తులు మీరు. మీపై బాధ్యత ఉంది. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమీక్షించాలి. మీరు పార్టీని నడిపించాలి. అందుకే పార్టీ సిద్ధాంతాలు, విధులు, బాధ్యతలపై శిక్షణ తరగతులు ఏర్పాటుచేయడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు పద్ధతి ప్రకారం నెరవేరుస్తున్నాం. సకాలంలో జీతాలు చెల్లిస్తున్నాం. 2019-24 మధ్య సామాన్య ప్రజలపై దాడి చేశారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య కలిసి హత్య చేశారు. డాక్టర్ సుధాకర్ ను హింసించారు. తన సోదరిని వేధిస్తున్నారని ప్రశ్నించిన అమర్ నాథ్ గౌడ్ ను చంపారు. మన పార్టీకి చెందిన తోట చంద్రయ్యను హత్య చేశారు. ఇవన్నీ మనం మర్చికూడదు. ప్రజలకు వివరించి వారిలో చైతన్యం తీసుకురావాలి.

Dhurandhar 2: ధురందర్-2లో హైలెట్‌గా ‘‘షిరానీ బలోచ్’’.. ఈ రోల్‌ పాకిస్తాన్ లీడర్‌‌దా..?

తెలుగుదేశం పార్టీ సొంతిల్లు, ప్రభుత్వం కిరాయి ఇల్లు వంటింది. వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయానికి సమయం కేటాయిస్తున్నాను. ఆ వారంలో నా శాఖకు సంబంధించిన కార్యక్రమం ఉన్నా పార్టీకే ప్రాధాన్యత ఇస్తున్నా. అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రతి బూత్ లో మెజార్టీ తీసుకువస్తే 175 స్థానాల్లో విజయం సాధించవచ్చు. నాకు 91వేల మెజార్టీ వచ్చినా 8శాతం బూత్ లలో మైనస్ వచ్చింది. దీంతో ఇప్పటి నుంచే నేను కసరత్తు చేస్తున్నా. రాష్ట్రవ్యాప్తంగా బలహీనంగా ఉన్న బూత్ ల బలోపేతంపై దృష్టిసారించాం. క్లస్టర్ పరిధిలో ఉన్న బలహీన బూత్ ల బలోపేతంపై మీరు దృష్టిసారించాలి.

Iran: అలీ లారిజానీ స్థానం భర్తీ.. కొత్త భద్రతా చీఫ్‌గా బఘేర్ నియామకం

పార్టీలో కూడా నిరంతరం మార్పు రావాలి. ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు సార్లు కంటే ఎక్కువగా ఉండకూడదు. క్లస్టర్ ఇంఛార్జ్ పొలిట్ బ్యూరో స్థాయి వరకు రావాలి. గ్రామ పార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరోలో కూర్చోవాలి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇది నాకు నాలుగోసారి. ఈ సారి నాకు ఆ బాధ్యత వద్దని చంద్రబాబు గారికి చెప్పా. వేరేవారికి అవకాశం ఇవ్వాలని, పార్టీలో పనిచేసే వారు చాలామంది ఉన్నారని చెప్పా. ఈ సంస్కరణ కోసం పార్టీలో నేను నాలుగేళ్లు పోరాడా. మంచి కోసం మార్పులు తీసుకువస్తున్నాం. నేను అనుకున్న మార్పులు తీసుకువచ్చే వరకు వదిలిపెట్టను. ఒకటికి పదిసార్లు చర్చించాలి. నమ్ముకున్న సిద్ధాంతం కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది. అలిగి ఇంట్లో కూర్చొంటే నష్టపోతాం. బహిరంగ వేదికలపై కాకుండా ఎవరైనా తమ అభిప్రాయాలను ‘మై టీడీపీ’ యాప్ ద్వారా తెలియజేయవచ్చు. మేం తీసుకునే పది నిర్ణయాల్లో మూడు తప్పవుతాయి. సరిదిద్దుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.

ఏ పార్టీలోనూ ఈ విధంగా శిక్షణ తరగతులను నిర్వహించడం లేదు. మేం కార్యకర్తల కష్టసుఖాలను తెలుసుకుంటున్నాం. ఇదీ తెలుగుదేశం పార్టీ అంటే. కలిసికట్టుగా పనిచేస్తే మనం ఆశించిన మార్పు సాధ్యమవుతుంది. పనిచేసిన వారిని ప్రోత్సహిస్తాం. మధ్యవర్తులు లేకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే వారిని నేరుగా గుర్తించాలనేదే మా లక్ష్యం. ఇవాళ చంద్రబాబు గారి చుట్టూ కోటరీ లేదు. అన్ని విషయాలను ఆయన నేరుగా తెలుసుకుంటున్నారు. నేను కూడా క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు తీసుకుంటాను. ఇది కొత్త పార్టీ టీడీపీ 3.O. వర్షన్ 3.Oకి వచ్చాం. మార్పు తీసుకువస్తాం. ఇంకా పటిష్టంగా ముందుకు తీసుకువెళ్తాం. ‘మై టీడీపీ’ యాప్ ద్వారా కార్యక్రమాలు చేపడతాం. అందరూ యాప్ తో అనుసంధానం కావాలి. పనిచేసే వారిని గుర్తిస్తాం. ఈ నెల 29 పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో వేదికపై పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారితో పాటు ‘మై టీడీపీ’ యాప్, క్లస్టర్, మండల పార్టీ అధ్యక్షుడు, అనుబంధ విభాగాలు.. ఈ విధంగా రాష్ట్రంలోనే నెం.1గా నిలిచిన 19 మంది కార్యకర్తలను గుర్తించి చంద్రబాబు గారితో పాటు వేదికపై కూర్చొనే అవకాశం కల్పిస్తాం. కార్యకర్తే అధినేత అనేది మా శాసనం. అది మా గైడింగ్ ప్రిన్సిపుల్, మా గైడింగ్ ఫోర్స్. ఏ కార్యక్రమం చేసినా కార్యకర్తలను గుర్తించాలనే లక్ష్యం పెట్టుకున్నామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Politics
  • My TDP App
  • Nara Lokesh
  • TDP 3.0
  • Telugu Desam Party

తాజావార్తలు

  • Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ

  • Latheesh: ఉప్పు దొంగతనం చేసుకుని తిన్న రోజుల నుంచి టాలీవుడ్ విలన్ దాకా!

  • Jitesh Sharma: “ఇంకా పిల్లాడే”.. వైభవ్‌ను ‘అన్‌ప్రొఫెషనల్’ అనడం వెనుక ఉన్న అసలు గుట్టు విప్పిన జితేష్

  • Manoj Tiwary: “హార్దిక్ పాండ్యా ఒంటరి అయిపోయాడు”.. టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!

  • Princess Amalia, Alexia: డచ్ యువరాణులు అలెక్సియా-అమాలియా హత్యకు నాజీ కుట్ర..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions