Vanda Devullu Review: వంద దేవుళ్ళు రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Vijay Antony, Swasika Vijay, Ajay Dhishan and others
- DIRECTOR: Sasi
- MUSIC: Balaji Sriram
- PRODUCER: Vijay Antony
విజయ్ ఆంటోనీ కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచిన ‘బిచ్చగాడు’ సినిమాలోని “వంద దేవుళ్ళు” పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాటలోని మొదటి రెండు పదాలే టైటిల్‌గా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ ఆంటోనీ. శ్వాసిక విజయ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో, విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దిశాన్ మరో ముఖ్య పాత్రలో నటించాడు. ‘బిచ్చగాడు’ ఫేమ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులలో మంచి హైప్ ఏర్పడేలా చేసింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
వంద దేవుళ్ళు కథ:
వాసవి (శ్వాసిక విజయ్) చిన్న వయసులోనే ఇద్దరు బిడ్డలకు తల్లి అయ్యాక భర్తను కోల్పోతుంది. పల్లెటూరిలో ఒక విధవరాలిగా అందరి నుంచి అవమానాలు ఎదుర్కొంటూ, ఆ ఊరి మగాళ్ళ దారుణమైన చూపుల నుంచి తప్పించుకుంటూ తన ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. పిల్లలు పెద్దయ్యాక ఒకానొక సందర్భంలో తల్లికి రెండో పెళ్లి ప్రస్తావన రావడంతో పెద్దకొడుకు (అజయ్ దిశాన్) మొదట్లో చాలా దారుణంగా వ్యవహరిస్తాడు. దీంతో ఆమె రెండో పెళ్లి ఆలోచనను విరమించుకుంటుంది.
అయితే, కొన్నాళ్ల తర్వాత ఆ విషయంలో రియలైజ్ అయిన పెద్దకొడుకు… ఆమె పెళ్లి అయ్యాకే తాను పెళ్లి చేసుకుంటానని శపథం చేసి, ఆమె కోసం సంబంధాలు చూడడం మొదలుపెడతాడో. ఈ క్రమంలోనే భార్యను కోల్పోయిన ఏడుకొండలు (విజయ్ ఆంటోనీ)తో సంబంధం మాట్లాడుతారు. అయితే “విధవరాలికి పెళ్లేంటి?” అనే ఉద్దేశంతో ఆ ఊరంతా ఏకమై ఆ పెళ్లిని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా వాసవి తల్లి, తోడబుట్టిన వాళ్ళు సైతం ఆమెను చంపేందుకు వెనకాడరు. ఈ క్రమంలో ఏం జరిగింది? వాసవి ఏడుకొండలను పెళ్లి చేసుకుందా? లేదా? ఆమెను కన్నవారే ఊరితో కలిసి బతకనిచ్చారా? లేదా? అనేది తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
ఒకరకంగా ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అనిపిస్తుంది. “విధవరాలికి పెళ్లి” అనే పాయింట్ చుట్టూ ఈ సినిమా కథను అల్లుకున్నారు. అయితే ఒక 20 ఏళ్ల క్రితం ఇలాంటి కథతో సినిమా చేసి ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టి ఉండేవారేమో కానీ, ఈ రోజుల్లో భర్తలతో నచ్చకపోతే వారికి విడాకులు ఇచ్చి తమకు నచ్చిన వారిని పెళ్లాడే స్వేచ్ఛ మహిళల్లో కనిపిస్తోంది. అలాంటిది, భర్త చనిపోయాక పిల్లలు పెద్దవారయ్యారు అనే కారణంతో ఊరంతా ఏకమై ఆ మహిళను చంపేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు చూపించడం కాస్త రియాలిటీకి దూరంగానే ఉంది. కాకపోతే, సినిమా చివర్లో ఇదంతా ఒక రియల్ స్టోరీ అని చూపించారు కాబట్టి ఎక్కడైనా ఒకటి అరా ఇలాంటి సందర్భాలు ఉండి ఉండవచ్చు. కానీ, దాన్ని జనరల్ రియాలిటీగా యాక్సెప్ట్ చేయడం మాత్రం ప్రేక్షకులకు కాస్త ఇబ్బందికరమే అని చెప్పొచ్చు.
అయితే సినిమా మొదలైన తర్వాత ఎటు వెళుతుందో అర్థం కాకుండా ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్‌లో శ్వాసిక విజయ్ పాత్ర మరణానికి చేరువడం, ఆ తర్వాత మళ్లీ బతికి రావడం, ఆమె పెళ్లి కోసం కొడుకులు పడే తాపత్రయం, ఆమె పెళ్లి ఆపాలని ఊరంతా పడే తపన… ఇవన్నీ ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా డైరెక్టర్ స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా శ్వాసిక విజయ్, ఆమె కొడుకుల పాత్రల చుట్టూనే సినిమా తిరుగుతుంది.
ఇక సెకండ్ హాఫ్ చివరి వరకు విజయ్ ఆంటోనీ పాత్ర ఎంట్రీ ఉండదు. అసలు సినిమాలో విజయ్ ఆంటోనీ ఉన్నాడా లేదా అనే అనుమానాలు కూడా కలిగే క్రమంలో… చివరిలో ఆయన పాత్ర ఎంట్రీ ఇచ్చాక సినిమా వేగం పుంజుకుంటుంది. వాస్తవానికి రెండు గంటల 11 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఎందుకో కాస్త సుదీర్ఘంగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే విజయ్ ఆంటోనీ పాత్ర ఎంట్రీ ఇచ్చాక మాత్రం కథ పరుగులు పెడుతుంది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన స్త్రీలు మరోసారి పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించవచ్చు అని మెసేజ్ ఇచ్చేలా ఈ సినిమా కథ రాసుకున్నారు. ఇప్పటి జనరేషన్‌కు మాత్రం ఈ సినిమా కథ కాస్త దూరంగా అనిపించినా, ఓవరాల్‌గా మాత్రం సినిమా ఎంగేజింగ్ గానే సాగిందని చెప్పొచ్చు.
నటీనటులు – సాంకేతిక వర్గం:
ఇక ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే… విజయ్ ఆంటోనీ కనిపించింది కొంచెం సేపే అయినా, అతని ఎంట్రీ కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. అతని పాత్ర చిన్నదే అయినా ఆకట్టుకున్నాడు. ఇక సినిమాలో కీలక పాత్రలో నటించిన శ్వాసిక విజయ్ మాత్రం తనదైన శైలిలో అద్భుతంగా నటించింది. ఒక విధవరాలిగా, ఇద్దరు ఎదిగి వచ్చిన కుర్రాళ్లకు తల్లిగా, ఆ వయసులో పెళ్లికి సిద్ధమైన ఓ మహిళగా భిన్న పార్శ్వాలు ఉన్న పాత్రలో ఆమె జీవించింది. ఆమెకు అవార్డు గ్యారెంటీ అనేలా ఆమె నటన ఉంది.
విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దిశాన్ గత సినిమాలతో పోలిస్తే నటనలో చాలా పరిణతి కనపరిచాడు. ఇక అతని తమ్ముడు పాత్రలో నటించిన నటుడు కూడా పర్వాలేదనిపించాడు. ఊరి పెద్ద, శ్వాసిక విజయ్ సోదరుడి పాత్రలలో నటించిన వారు కూడా తమదైన శైలిలో ఆకట్టుకున్నారు. మిగతా పాత్రధారులు అందరూ తమ పరిధి మేరకు నటించారు.
ఎప్పుడో తెలుగులో ‘శీను’ లాంటి సినిమా చేసిన డైరెక్టర్ శశి, ‘బిచ్చగాడు’తో మాత్రం ఒక్కసారిగా తెలుగులో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇక ఈ సినిమా మేకింగ్‌లో కూడా ఆయన మార్క్ చాలా వరకు కనిపించింది. అయితే ఈ కథ రియాలిటీకి కాస్త దూరంగా ఉన్నా సరే, చాలామంది ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. డైలాగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రాయడంలో భాష్య శ్రీ సక్సెస్ అయ్యాడు. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది, అయితే సెకండ్ హాఫ్‌పై ఇంకాస్త వర్కౌట్ చేసి ఉండవచ్చు. సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. సంగీతం కూడా సినిమాకు ఎక్కడా అడ్డు అనిపించేలా లేదు, నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్ వర్డిక్ట్: ఈ ‘వంద దేవుళ్ళు’.. ఎమోషనల్ గా సాగే ఒక అమ్మ కథ!
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?