Veerabhadruni Rahasyam Review : వీరభద్రుని రహస్యం రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 3 / 5
- MAIN CAST: Annie, Raghu Kunche, and others
- DIRECTOR: Sri Vardhan Reddy
- MUSIC: Sudha Srinivas
- PRODUCER: Zee 5
1990ల కాలంలో టెలివిజన్ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్ ‘మర్మదేశం’. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సరికొత్త రికార్డులు సృష్టించిన ఆ కల్ట్ క్లాసిక్ Universe నుండి వచ్చిన సరికొత్త వెబ్ సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ5’ వేదికగా విడుదలైన ఈ సుదీర్ఘమైన లాంగ్-ఫార్మ్ సిరీస్ మొదటి 5 ఎపిసోడ్లు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాయో చూద్దాం.
వీరభద్రుని రహస్యం కథ:
ఈ కథ అంతా నమ్మకాలకు, రహస్యాలకు నిలయమైన ‘వీరభద్రపురం’ అనే ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరి ప్రజలకు తమ గ్రామ దైవమైన వీరభద్రుడంటే అమితమైన భక్తి, అంతేస్థాయిలో భయం. ఊరిలో ఎవరైనా తప్పు చేస్తే దేవుడే స్వయంగా శిక్షిస్తాడనేది వారి నమ్మకం. దానికి తగ్గట్టే, ఆ ఊరి పురాతన ఆలయంలో పవిత్రమైన ‘ధర్మగంట’ మోగిన ప్రతిసారీ.. గుడి పరిసరాల్లోనో లేదా శపించబడిన కొండ అయిన ‘గద్దల గుట్ట’పైనో ఒక శవం ప్రత్యక్షమవుతుంది. ఆ మరణాలను గ్రామస్తులంతా దైవ న్యాయంగా భావించి మౌనంగా ఉండిపోతారు.
Also Read
ఈ నేపథ్యంలో, సిటీ నుండి ‘వెన్నెల’ (అన్నీ) అనే ఒక హేతువాది, ధైర్యవంతురాలైన యువతి తన తండ్రి రామస్వామిని వెతుకుతూ వీరభద్రపురంలో అడుగుపెడుతుంది. ఆమె వచ్చిన సమయంలోనే ఊరిలో మరో దారుణమైన హత్య జరుగుతుంది. ఊరి జనం దీనిని కూడా దైవశిక్షగా భావించినా, వెన్నెల మాత్రం ఈ మూఢనమ్మకాన్ని అస్సలు ఒప్పుకోదు. ఈ చావుల వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టాలని ఆమె ప్రయత్నిస్తుంది.
మరోవైపు కథ 1972 మరియు 1990ల కాలాల మధ్య Parallel టైమ్లైన్సులో సాగుతూ ఉంటుంది. గతంలోకి వెళ్తే.. యోగానందం (రఘు కుంచె) కుమారుడైన కార్తికేయ చిన్నతనంలో ఆడుకుంటూ అడవిలో తప్పిపోవడం, అతనికి వీరభద్రుడు ప్రత్యక్షమై ఒక కత్తిని ఇవ్వడం లాంటి ఆసక్తికరమైన సంఘటనలు కనిపిస్తాయి. అసలు ఈ హత్యలకు, ఆ పురాతన గంటకు ఉన్న సంబంధం ఏంటి? భక్తి ముసుగులో జరుగుతున్న వ్యవస్థీకృత నేరాలను వెన్నెల ఎలా బయటపెట్టింది? అనే విషయాలు తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ
మొత్తం 60 ఎపిసోడ్ల భారీ కథాంశంతో ప్లాన్ చేసిన ఈ సిరీస్ నుండి ప్రస్తుతానికి మొదటి 5 ఎపిసోడ్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి కథ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఏకంగా అరవై ఎపిసోడ్స్ ను మేకర్స్ ప్లాన్ చేశారు కాబట్టి ఒక్కో నిజం నిదానంగా బయటపడవచ్చు అని భావించొచ్చు. ప్రస్తుతానికైతే తర్వాత కథలో ఏం జరుగుతోందనే ఆసక్తిని మాత్రం కలిగించడంలో మేకర్ సక్సెస్ అయ్యారు. అది అరవై ఎపిసోడ్స్ వరకూ నిలుపుకుంటారా? అనేది సిరీస్ సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే… ప్రతి ఎపిసోడ్ లోనూ 1972లో జరిగిన కథను కొంత చూపించి, ఆ తర్వాత 1992లో జరిగిన కథను చూపుతున్నారు. అప్పుడు జరిగిన సంఘటనల పర్యవసానాన్ని ఇరవై ఏళ్ళ తర్వాత కథలో చూపడం కనెక్ట్ అయ్యేలా ఉంది. సస్పెన్స్, ఫోక్లోర్, ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ ఇష్టపడే వారికి, ముఖ్యంగా పాత కాలపు వింటేజ్ థ్రిల్లర్స్ చూడాలనుకునే వారికి ‘వీరభద్రుని రహస్యం’ ఒక మంచి ఎంపిక. ఎలాంటి అశ్లీలత లేకపోవడం వల్ల కుటుంబ సభ్యులందరితో కలిసి డిజిటల్ స్క్రీన్‌పై హ్యాపీగా చూడొచ్చు.
నటీనటుల పనితీరు అన్నీ నాస్తికురాలిగా, నగర వాతావరణం నుండి వచ్చి పల్లెటూరి మూఢనమ్మకాలను ప్రశ్నించే వెన్నెల పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. నిజానిజాలు తెలుసుకోవాలనే ఆమె పట్టుదల, హావభావాలు సిరీస్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. యోగానందంగా రఘు కుంచె నటన చాలా హుందాగా, కూల్‌గా సాగుతుంది. కథ ముందుకు సాగే కొద్దీ ఆయన పాత్రలో మరిన్ని వైవిధ్యాలు కనిపించే అవకాశం ఉంది. యోగానందం తల్లి పాత్రలో అనురాధ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. కేవలం కొన్ని సెకన్ల పాటు కనిపించినప్పటికీ, గంభీరమైన ఆమె లుక్ ప్రేక్షకులలో ఒక రకమైన భయాన్ని కలిగిస్తుంది. సిఐ రవి పాత్రలో అభినవ్, ప్రొఫెసర్ నందగా కమల్ తూము మరియు కార్తికేయగా నటించిన రఘు తమ పాత్రల పరిధి మేరకు చక్కని నటనను కనబరిచారు.
సాంకేతిక వర్గం పనితీరు భీమగాని శ్రీవర్ధన్ రెడ్డి ఈ సిరీస్‌ను మర్మదేశం మూలాలను దెబ్బతీయకుండా, నేటి తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. 1970, 1990ల కాలాలకు సంబంధించిన రెండు వేర్వేరు టైమ్‌లైన్‌లను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సమాంతరంగా నడిపించిన విధానం బాగుంది. 60 ఎపిసోడ్ల సుదీర్ఘ కథ కావడంతో స్క్రిప్ట్ చాలా నిదానంగా, వింటేజ్ శైలిలో సాగుతుంది. సుధా శ్రీనివాస్ అందించిన నేపథ్య సంగీతం (BGM) ఈ థ్రిల్లర్ సిరీస్‌కు ప్రాణం పోసింది. అనవసరమైన హడావుడి శబ్దాలు లేకుండా, సీన్లలోని సస్పెన్స్‌ని ఎలివేట్ చేసేలా క్లాసిక్ టోన్‌లో మ్యూజిక్ అందించారు. సుభాష్ విజువల్స్ పల్లెటూరి వాతావరణాన్ని, ఆ ఊరిలోని మిస్టరీ మూడ్‌ను చక్కగా స్క్రీన్‌పై ఆవిష్కరించాయి. రాగం సత్య నితీశ్ ఎడిటింగ్ వర్క్ నీట్‌గా ఉంది. ఎక్కడా కథనం జంప్ అయినట్లు అనిపించదు.
ఫైనల్లీ : కిక్ స్టార్ట్ ఫర్ వరల్డ్ ఆఫ్ వీరభద్రుని రహస్యం
తాజావార్తలు
-
Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
-
DADA Movie : ‘దాదా’టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
-
Flight Fight Video Viral: విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. టీ-షర్ట్ చినిగేలా పొట్టుపొట్టు కొట్టుకున్న వైనం
ట్రెండింగ్
-
Zeptoలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?