Therachapa Review: తెరచాప రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు తదితరులు
- DIRECTOR: Joel George
- MUSIC: Prajal Krish
- PRODUCER: Kailash Durgam (Ananya Creations)
అనన్య క్రియేషన్స్ పతాకంపై కైలాష్ దుర్గం నిర్మించిన ‘తెరచాప’ మూవీ, ప్రమోషన్లతో ఇప్పటికే సినీ ప్రియుల్లో మంచి అంచనాలను నెలకొల్పింది. జోయల్ జార్జ్ దర్శకత్వంలో సముద్ర తీర ప్రాంత నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా, ఏప్రిల్ 17న థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మత్స్యకార నేపథ్య మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
తెరచాప కథ:
ఈ సినిమా కథ మొత్తం సముద్ర తీర ప్రాంత ప్రజల చుట్టూ తిరుగుతుంది. మత్స్యకార సమాజం కోసం నిరంతరం శ్రమించే నిజాయితీ గల నాయకుడు, ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న కాశీ బాబు (నాగ మహేష్) ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతాడు. అయితే, కాశీ బాబు మరణానికి ఆయన కొడుకు ఈశ్వర్ (నవీన్ రాజ్ శంకరపు) నిర్లక్ష్యమే కారణమని ఊరు మొత్తం వేలెత్తి చూపుతుంది. తన తండ్రిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే ఈశ్వర్, ఆ నిందను భరించలేకపోతాడు. తన తండ్రి మరణం వెనుక ఏదో పెద్ద వ్యవహారమే ఉందని అనుమానించిన ఈశ్వర్, అసలు నిజం తెలుసుకోవడానికి రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో అతనికి సీత (శ్రీలు), గాయత్రి (పూజా సుహాసిని) ఎలా సహాయపడ్డారు? రాజీవ్ కనకాల పోషించిన ఆనంద్ రాజు పాత్ర ఈ కథను ఎలా మలుపు తిప్పింది? ‘పుష్ప’ ఫేమ్ జగదీష్ ప్రతాప్ బండారి పాత్ర ప్రాముఖ్యత ఏమిటి? అన్నదే ఈ సినిమా అసలు కథ.
Also Read
విశ్లేషణ:
దర్శకుడు జోయెల్ జార్జ్ ఈ సినిమా కోసం ఒక సున్నితమైన పాయింట్ ఎంచుకున్నారు. తండ్రీ కొడుకుల మధ్య ఉండే గాఢమైన అనుబంధాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా, ఒక మిస్టరీ చుట్టూ అల్లడం సినిమాకు కొత్తదనాన్ని ఇచ్చింది. సముద్ర తీర ప్రాంతపు బ్యాక్ డ్రాప్ సినిమాకు ఒక సహజత్వాన్ని తెచ్చిపెట్టింది. కథ ప్రారంభం నుంచే తండ్రి మరణం వెనుక ఉన్న చిక్కుముడి విప్పే ప్రయత్నం చేయడం వల్ల ప్రేక్షకుల్లో కొంతవరకు ఉత్కంఠను రేకెత్తించడంలో దర్శకుడు సఫలమయ్యారు. సినిమా ఫస్టాఫ్ కథను స్థాపించడానికి, పాత్రల పరిచయానికి దర్శకుడు వాడుకున్నారు. తండ్రి మరణం తర్వాత ఈశ్వర్ చుట్టూ అల్లుకున్న పరిణామాలు ఆసక్తికరంగా సాగుతాయి. అయితే, సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా, కావాలని జొప్పించినట్లుగా అనిపించినప్పటికీ, క్లైమాక్స్ వైపు వెళ్లేకొద్దీ మళ్ళీ వేగం పుంజుకుంటుంది.
నటీనటుల విషయానికి వస్తే తొలి సినిమానే అయినా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ హీరో నవీన్ రాజ్ శంకరపు మొదటి సినిమా చేస్తున్న నటుడిలా ఎక్కడా అనిపించకుండా, చాలా అనుభవం ఉన్న నటుడిలా నటనను కనబరిచాడు. ఇక రాజేష్ భూపతి, భూపతి రాజు పాత్రలో విలనిజం పండించాడు. ఇక రాజీవ్ కనకాల నటన ఈ సినిమాకి వెన్నెముక. తన మార్కు నటనతో కీలక సన్నివేశాల్లో ప్రాణం పోశారు. తండ్రీ కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమా చూస్తున్నంత సేపు హృదయాన్ని హత్తుకుంటాయి.
సాంకేతిక అంశాల విషయానికి వస్తే ప్రజల్ క్రిష్ అందించిన పాటలు కథలో భాగంగా సాగిపోతాయి. ఎంఎల్ రాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ అజీమ్ మరియు వెంకట్ ద్వయం కెమెరా పనితనం అద్భుతం. పచ్చని పల్లెటూరి అందాలను ఎంత అందంగా చూపించారో, సముద్రపు ఉధృతిని, తీవ్రతను అంతే వాస్తవికతతో తెరపై ఆవిష్కరించారు.
ఫైనల్లీ ‘తెరచాప’ సామాజిక నేపథ్యంతో సాగే ఎమోషనల్ డ్రామా.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!