Thella Kagitham Review: ‘తెల్ల కాగితం’ రివ్యూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.25 / 5
- MAIN CAST: Harsh Roshan, Nakshatra
- DIRECTOR: Ramesh Bandreddi
- MUSIC: Vijai Bulganin
- PRODUCER: Krishna Kommalapati
‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ సినిమారో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్ష్ రోషన్, ఆ తర్వాత ‘బ్యాండ్ మేళం’తో వచ్చినా పెద్దగా వర్కౌట్ కాలేదు. తాజాగా దర్శకుడు రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో టీనేజ్ డ్రామాగా తెరకెక్కిన ‘తెల్ల కాగితం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నక్షత్ర హీరోయిన్గా పరిచయమైన ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ:
టెన్త్ చదివే అమాయకపు టీనేజ్ అబ్బాయి రాము (హర్ష్ రోషన్), కుటుంబ ఆంక్షల నడుమ పెరిగే అమ్మాయి నక్షత్ర) ఒకే స్కూల్ లో చదువుతూ ప్రేమలో పడతారు. అయితే రాంగ్ గైడెన్స్, వయసు తెచ్చిన తొందరపాటుతో వారిద్దరూ శారీరకంగా దగ్గరవుతారు. ఆ తర్వాత ఆ అమ్మాయి గర్భం దాల్చిందనే అనుమానం రావడంతో ఈ ఇద్దరి జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది. ఈ క్రమంలో ఆ విషయాన్ని ఇంట్లో చెప్పలేక భయపడుతూ, తామే పరిష్కరించుకోవాలని చూస్తారు. అసలు ఆ సమస్య నుంచి బయటపడటానికి ఆ జంట ఏం చేసింది? చివరికి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసిందా? అనేదే మిగతా కథ.
Also Read
విశ్లేషణ:
టీనేజ్ వయసులో ఏదైనా తప్పు జరిగినా లేదా సందేహం వచ్చినా, బయట వ్యక్తుల సలహాలు నమ్మి మోసపోకుండా నేరుగా తల్లిదండ్రులకే చెప్పుకోవాలనే మంచి సందేశాన్ని ఈ కథ ద్వారా ఇవ్వాలని దర్శకుడు భావించాడు. ఆలోచన పరంగా ఇది ఎంతో అవసరమైన విషయమే అయినా, కథనం నడిపించిన తీరులోనే అసలు సమస్య వచ్చిపడింది. గతంలో వచ్చిన ‘కొత్త బంగారు లోకం’ వంటి చిత్రాలు ఇదే తరహా సున్నితమైన అంశాన్ని చాలా డెప్త్ తో కూడిన ఎమోషన్స్, బూతు లేని కామెడీతో ఆకట్టుకున్నాయి కూడా. కానీ ‘తెల్ల కాగితం’లో తొలి అర గంట కాస్త పర్వాలేదనిపించినా, కథలోని అసలు సమస్య మొదలైన తర్వాత కథనం ఎటూ సాగక అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఆ సమస్య నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలనే పదే పదే చూపించడంతో ప్రేక్షకుల్లో సహనం నశిస్తుంది. ఆ జంట పడే వేదనను ప్రేక్షకుడు తనదిగా ఫీలయ్యేలా బలమైన డ్రామాను సృష్టించలేకపోయారు. దీనికి తోడు కథలో బలవంతంగా ఇరికించిన అసభ్యకరమైన కామెడీ కూడా ఏమాత్రం వర్కౌట్ కాలేదు.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే:
తన గత సినిమాల్లోఎంతో సహజంగా నటించిన హర్ష్, ఈ సినిమాలో చాలా సన్నివేశాల్లో సరిగా సెట్ కాలేదు అనిపించింది,.కొన్ని సన్నివేశాల్లో మెప్పించినా, నటుడిగా అతని పూర్తి ప్రతిభ బయటకు రాలేదు. నక్షత్రకి ఇది హీరోయిన్ గా మంచి లాంచ్. చక్కని ఆహార్యంతో పాటు ఎమోషన్స్ పండించడంలో పరిణతి కనబరిచింది. తెరపై ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా సహజంగా ఉంది. హీరోయిన్ తండ్రి పాత్రలో అజయ్ నటన హైలైట్‌గా నిలుస్తుంది; క్లైమాక్స్‌లో ఆయన పండించిన సెంటిమెంట్ ఆకట్టుకుంటుంది. శరణ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి తమ పరిధి మేరకు నటించారు. స్నేహితుడిగా దీపక్ మాలి కొన్ని నవ్వులు పంచాడు.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే:
విజయ్ బుల్గానిన్ మెలోడీలకు పెట్టింది పేరు అయినప్పటికీ, ఈ సినిమాలో ఒక్క పాట కూడా గుర్తుంచుకునేలా లేదు. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను ఎలివేట్ చేయలేక పోయింది. కే.వి. గుహన్ కెమెరా పనితనం పరిమిత వనరుల్లో ఉన్నంతలో మెరుగ్గా ఉంది; పచ్చని పల్లెటూరి లొకేషన్లను అందంగా చూపించారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉండొచ్చు..నందు సవిరిగాన రాసిన సంభాషణల్లో ఒకటి రెండు మినహా పదును లేదు. దర్శకుడు రమేష్ బండ్రెడ్డి ఎంచుకున్న పాయింట్ మంచిదే అయినప్పటికీ, దాన్ని వెండితెరపై ఆసక్తికరంగా నడిపించడంలో పూర్తిగా తడబడ్డారు.
ఫైనల్లీ: ‘తెల్ల కాగితం’ ఆకట్టుకోని మెసేజ్ ఓరియంటెడ్ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ.
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?