Spider-Man Brand New Day Movie Review: స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: టామ్ హాలండ్, జెండయా, సాదీ సింక్, జాకబ్ బాటాలాన్, జాన్ బెర్నథాల్
- DIRECTOR: డెస్టిన్ డేనియల్ క్రెటన్
- MUSIC: మైఖేల్ జియాచినో
- PRODUCER: మార్వెల్ స్టూడియోస్
Spider-Man Brand New Day Movie Review: స్పైడర్ మ్యాన్ సిరీస్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో మార్వెల్ స్టూడియోస్‌లో పుట్టిన ఈ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైతం ప్రతి ఒక్కరికీ ఒక ఫేవరెట్ క్యారెక్టర్ అయిపోయిందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే స్పైడర్ మ్యాన్ సిరీస్ నుంచి కొత్త సినిమా వస్తుందనగానే అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఇండియాలో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా, ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆసక్తికరంగా ఒకరోజు ముందుగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ డాల్బీ విజన్‌లో ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ:
పీటర్ పార్కర్ అకా స్పైడర్ మ్యాన్ (టామ్ హాల్యాండ్)ను ‘పీటర్’గా ప్రపంచమంతా మరిచిపోతుంది. మరొకపక్క తన శరీరంలో ఊహించని మార్పులు గమనించి అయోమయానికి గురవుతాడు. అదే సమయంలో ‘డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్’ (DDC) పై ఒక అదృశ్య శక్తి దాడులు చేస్తూ V-MAX కోసం వెతుకుతుంది. అయితే అసలు ఆ అదృశ్య శక్తి ఏమిటి? ఆ శక్తి సోకినప్పుడల్లా మనుషులు ఎందుకు దెయ్యం పట్టిన వారిలా ప్రవర్తిస్తున్నారు? DDC పై దాడి చేస్తున్నది ఎవరు? అసలు V-MAX అంటే ఏమిటి? దానిని కాపాడటానికి స్పైడర్ మ్యాన్ ఏం చేశాడు? అనేది బిగ్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే.
Also Read
విశ్లేషణ:
ఈ స్పైడర్ మ్యాన్ అనేది ఒక రకమైన ఫ్రాంచైజీ సిరీస్ అని అందరికీ తెలిసిందే. కాబట్టి స్పైడర్ మ్యాన్ గత సినిమాలు చూసిన వారికి మాత్రమే ఇది కనెక్ట్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి ఈసారి డీసీ (DC) లోని ఒక క్యారెక్టర్‌ను ఈ సినిమాలోకి తీసుకువచ్చి కొంతవరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశారు మేకర్స్. అయితే గత స్పైడర్ మ్యాన్ సినిమా సాధించిన భారీ విజయాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం కోసమే అన్నట్టుగా కథను మార్చకుండా, ఈ సినిమా కోసం ఒక ఫ్రెష్ స్టోరీతో రావడం కొంతవరకు కలిసివచ్చే అంశం.
భారీ అంచనాలు, మితిమీరిన హంగామా లేకుండా థియేటర్లలోకి వచ్చిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సాధారణంగా ఒక సినిమా సీక్వెల్ వస్తోందంటే మునుపటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను రీక్రియేట్ చేయాలనే ఆరాటం కనిపిస్తుంది. కానీ, దర్శకుడు ఆ ఉచ్చులో పడకుండా కథనే నమ్ముకుని ఈ చిత్రాన్ని మలిచిన తీరు అద్భుతం.
‘నో వే హోమ్’ తెచ్చిపెట్టిన క్రేజ్‌ను వాడుకోవాలని పాత పాత్రల డ్రామాను మళ్లీ తీసుకురాకుండా, సున్నా నుంచి జీవితాన్ని ప్రారంభించే ఒక కుర్రాడి ప్రయాణంగా పీటర్ పార్కర్ కథను సహజంగా చూపించారు. హీరో పడే వేదనను కేవలం సింపతీ కోసం వాడుకోకుండా కథనంలో భాగం చేశారు. దానివల్ల పీటర్ ఎదుర్కొనే చిన్న ఇబ్బంది కూడా ప్రేక్షకుడిని కలిచివేస్తుంది, అతడు సాధించే చిన్న గెలుపైనా థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది.
అలాగే అనవసరమైన పేలుళ్లు, నిరంతర ఫైట్ సీన్లు లేకుండా ఎమోషన్స్ పండాల్సిన చోట స్లోగా కథను నడిపిన విధానం కొంతమందికి మంచి అనుభూతిని ఇస్తే, కొంతమందికి లాగ్ చేసిన ఫీలింగ్ ఇస్తుంది. వరుస గూస్బంప్స్ ఇచ్చే సన్నివేశాలు లేకపోయినా, పాత్రల పరిచయం మరియు కథనం సాగే తీరు గ్రాండ్ సూపర్ హీరో సినిమాల కంటే భిన్నంగా, వాస్తవికంగా అనిపిస్తుంది.
విజువల్ ఎఫెక్ట్స్ (VFX) మరియు వెన్నులో వణుకు పుట్టించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్‌ను వేరే లెవల్‌కు తీసుకెళ్లాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ముగింపు దశకు వచ్చేసరికి మార్వెల్ పాత ఫార్ములాకే పరిమితమైనట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో స్క్రీన్ పై ఎక్కువ పాత్రలు రావడం వల్ల కాస్త గందరగోళం అనిపిస్తుంది. కొన్ని కీలకమైన ట్విస్టులుగా భావించిన వాటిని మరీ సులువుగా తేల్చేసిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. అటువంటి చిన్నపాటి లోపాలు ఉన్నప్పటికీ, అవి సినిమా స్థాయిని తగ్గించలేకపోయాయి. స్పైడర్ మ్యాన్ పాత్రను మరింత పరిణతి చెందిన వ్యక్తిగా మలచడం బాగుంది.
నటీనటుల విషయానికి వస్తే, స్పైడర్ మ్యాన్ టైటిల్ రోల్లో నటుడిగా టామ్ హాల్యాండ్ మరోసారి తన సత్తా చాటుకున్నారు. ఒకపక్క యాక్షన్, మరోపక్క ఎమోషన్, అలాగే అప్పుడప్పుడు కామెడీ అంటూ అన్ని యాంగిల్స్ బాగా హ్యాండిల్ చేశారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ జీన్ గ్రేగా (సాడీ సింక్) కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంది. జెండయా స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువే అయినా, ఉన్నంతలో మెప్పించారు. జాన్ బర్న్థాల్, మార్క్ రఫ్ఫాలోలు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ‘షాంగ్-చి’ ఫేమ్ డెస్టిన్ డేవిడ్ క్రెట్టన్ ఈ సినిమాలోనూ తన యాక్షన్ మేకింగ్ మార్కును స్పష్టంగా చూపించారు. సన్నివేశాలను భారీగా డిజైన్ చేయడంలో సక్సెస్ అయినప్పటికీ, కథనంలో ఎమోషనల్ డెప్త్‌ను మరింత బలంగా చూపించి ఉంటే ప్రేక్షకులకు ఇంకా బాగా కనెక్ట్ అయ్యేది.
ఇక ఈ సినిమాకు బ్రెట్ పావ్లాక్ కెమెరా పనితనం అతిపెద్ద ఆకర్షణగా నిలిచింది. యాక్షన్ సీక్వెన్సులను ఆయన చాలా స్టైలిష్‌గా, విజువల్ గ్రాండ్నెస్తో బంధించారు. దీనికి తోడు క్వాలిటీ VFX విజువల్స్‌ను వేరే లెవల్‌కు తీసుకెళ్లాయి. జ్యాకీ చాన్ స్టంట్ టీమ్ అందించిన యాక్షన్ కొరియోగ్రఫీ థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రతి ఫైట్ సీన్‌ను చాలా వినూత్నంగా రూపకల్పన చేశారు. మైఖేల్ గియాచినో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సన్నివేశాల్లోని మూడ్‌ను చక్కగా ఎలివేట్ చేసింది. అయితే, సెకండ్ హాఫ్‌లో ఎడిటర్ మరికొంత దృష్టి పెట్టి ట్రిమ్ చేసి ఉంటే సినిమా రన్‌టైమ్ ఇంకా క్రిస్ప్‌గా ఉండేది.
ఫైనల్లీ: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మార్వెల్ ఫ్యాన్స్‌కి ఒక మంచి ఫీస్ట్ లాంటి సినిమా!
తాజావార్తలు
-
MINI Cooper Convertible Stardust Edition: మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
CJP: కాక్రోచ్ పార్టీ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్.. కేంద్రం కీలక ప్రకటన..
-
Akhil Akkineni : వంద కోట్ల క్లబ్లో అయ్యగారు.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
-
Srinivasa Mangapuram OTT: మహేష్ మేనల్లుడు డిజిటల్ ఎంట్రీ.. రిలీజ్ రోజే ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకున్న ‘శ్రీనివాస మంగపురం’
-
West Bengal Cash Haul: ఎక్స్- బస్ డ్రైవర్ ఇంట్లో రూ. 28 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం..
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?