Sakshi Review: సాక్షి రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: శరణ్, జాన్వీర్ కౌర్, నాగబాబు, అజయ్, ఇంద్రజ, ఆమని
- DIRECTOR: శివ కేశనకుర్తి
- MUSIC: భీమ్స్ సిసిరీలియో
- PRODUCER: ఆర్.యు.రెడ్డి
Sakshi Movie Telugu Review: సినీ పరిశ్రమలో వారసుల సందడి ఎప్పుడూ ఉండేదే. ఇప్పటికే సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి అనేక మంది హీరోలుగా రాగా ఇప్పుడు సీనియర్ నరేష్ బావ కుమారుడు హీరో శరణ్ కుమార్ కూడా హీరోగా లాంచ్ అయ్యాడు. ఇప్పటికే మిస్టర్ కింగ్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఈ వారం సాక్షి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శివ కేశన కుర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్యూ రెడ్డి -బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3గా మునగాల సుధాకర్ రెడ్డి నిర్మించారు. ఇక ఈ సినిమా ఎట్టకేలకు ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథ:
అర్జున్(శరణ్ కుమార్) ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తూ ఉంటాడు. తన ప్రాజెక్ట్ మేనేజర్ నుంచి ఒక పర్సనల్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండగా అతనికి రిపోర్టర్ అయిన నేత్ర(జాన్వీర్ కౌర్) పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే మరోపక్క సీఎం(ఇంద్రజ) అవినీతిని ఆమె తండ్రికి బట్టబయలు చేసే క్రమంలో అర్జున్ తండ్రి(దేవీ ప్రసాద్) ఒకరోజు రోడ్డు ప్రమాదానికి గురవుతాడు.బతికించుకోవాలని అనుకుంటే లక్షలు అవుతాయని తెలిసి గంజాయి స్మగ్లింగ్ చేసేందుకు సిద్ధం అవుతాడు. అయితే అనుకోకుండా మర్డర్ కేసులో ఇరికించబడతాడు.. మరి ఈ గంజాయి స్మగ్లింగ్ ట్రాప్ లో అర్జున్ ను ఇరికించింది ఎవరు? మర్డర్ కేసుల నుంచి అర్జున్ బయట పడతాడా? ఈ విషయంలో త్రిపాఠి(నాగబాబు) ఏం చేశాడు? చివరికి అసలు అర్జున్, నేత్ర ఒక్కటయ్యారా? అనేదే సినిమా కథ.
Also Read
నటీనటులు:
నటీనటుల విషయానికి వస్తే మొదటి సినిమాతో పోలిస్తే శరన్ కుమార్ నటనలో పరిణితి కనిపించింది. జాన్వీర్ కౌర్ కి సినిమాలో కేవలం అందం కోసమే కాకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. విలన్ గా నటించిన నాగబాబు ఇతర సీనియర్ నటులతో పోటీపడి నటించారు. అజయ్, ఇంద్రజ, దేవీ ప్రసాద్ వంటి వారు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నీకల్ టీమ్:
కథ పరంగా చూస్తే రొటీన్ అనిపించినా కొత్త పాయింట్ ఎంచుకున్నాడు డైరెక్టర్. రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకులే చిల్లర పంచాయితీలు చేస్తూ తమ తమ భుక్తి కోసం ప్రజలను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని దోచుకుంటే ఒక నిస్వార్ధ జర్నలిస్టు తండ్రి కోసం కొడుకు చేసే ధర్మ యుద్ధమే ఈ సినిమా. సినిమా ఓపెనింగ్ లోనే సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచేసిన డైరెక్టర్ నెమ్మదిగా కథలోకి తీసుకు వెళ్ళాడు. ఇక లవ్ ట్రాక్ తక్కువగానే అనిపించినా గంజాయి స్మగ్లింగ్ కి హీరో రెడీ అయ్యాక కథలో స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో స్క్రీన్ ప్లే పకడ్బందీగా రాసుకుని సెకండ్ హాఫ్ నుంచి అనేక ట్విస్టులు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. మొత్తంగా ఈ సినిమాతో కొన్ని సీరియస్ సమస్యలను టచ్ చేసి ఆలోచన రేకెత్తించే ప్రయత్నం చేశారు. దర్శకుడిగా శివ కేశన కుర్తి తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసి కొంత వరకు సక్సెస్ అయ్యాడు. ఇక భీమ్స్ సంగీతం గురించి చెప్పాల్సింది ఏముంది, సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టాడు. ఇక ఎడిటింగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నట్లు అనిపించింది.
ఫైనల్ గా చెప్పాలంటే:
సీరియస్ సమస్యలను ఆలోచింపచేసేలా ప్రశ్నించే సినిమా ఈ సాక్షి.. ఓటీటీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!