Subham Movie Review: సమంత నిర్మాతగా ‘శుభం’ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.25 / 5
- MAIN CAST: Harshith, Shriya Kontham, Shalini Kondepudi, Srinivas Gavireddy, Charan Peri and others
- DIRECTOR: Praveen Kandregula
- MUSIC:
- PRODUCER: Samantha
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమంత, తర్వాత కాలంలో వ్యక్తిగత ఇబ్బందులు, అనారోగ్య కారణాలతో సినిమాలను బాగా తగ్గించేసింది. అయితే, ఆమె నిర్మాతగా మారి, ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడమే కాక, ఒక చిన్న సినిమాను కూడా నిర్మించింది. సినిమా బండి అనే సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో శుభం అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో మూడు యువ జంటలు నటించగా, మిగిలిన వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై ఆసక్తిని ఏర్పరిచేలా చేశారు మేకర్స్. ఈ సినిమా మే తొమ్మిదో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
శుభం రివ్యూ:
Also Read
సినిమా కథ అంతా 2005 తర్వాత జరుగుతూ ఉంటుంది. భీమిలిలో కేబుల్ ఆఫీస్ నడిపే శీను (హర్షిత్ రెడ్డి) పెళ్లి చూపుల్లోనే శ్రీవల్లి (శ్రియ కొణతం)ను చూసి ఇష్టపడతాడు. వెంటనే పెళ్లయిపోతుంది. కానీ, మొదటి రాత్రే ఆమె జన్మజన్మల బంధం అనే సీరియల్‌కు బాగా అడిక్ట్ అయిపోయిన విషయం అర్థమవుతుంది. ఎంతలా అంటే, టీవీ కట్టేస్తే భర్తనే కొట్టేంత! మొదట్లో ఇది తన ఒక్కడి సమస్య అనుకుంటాడు. కానీ, తన స్నేహితులు చరణ్ పేరి, గవిరెడ్డి శ్రీనివాస్‌ల పరిస్థితి కూడా అదేనని తెలిసిన తర్వాత, మరో షాకింగ్ విషయం బయటపడుతుంది—ఊరిలోని అందరి మగవాళ్ల పరిస్థితి ఇదేనని! దానికి కారణం ఏంటని తెలుసుకున్న తర్వాత, ఈ పరిస్థితి నుంచి ఊరు మొత్తాన్ని గట్టెక్కించే ప్రయత్నం చేస్తారు. మరి ఈ ప్రయత్నంలో శీను అండ్ ఫ్రెండ్స్ సఫలమయ్యారా? మధ్యలో డిష్ కుమార్ (వంశీ) చేసిన పనులు ఏంటి? చివరికి ఏం జరిగింది? అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ:
నిజానికి దీన్ని సినిమాగా చూస్తే ఏమాత్రం లాజికల్‌గా అనిపించదు. కానీ, ఈ రోజుల్లో వస్తున్న సినిమాల్లో లాజిక్ వెతకడం కన్నా, అది మనల్ని ఎంతవరకు మ్యాజిక్ చేసిందని చూడడం బెటర్. అయితే, ఆ విషయంలో కూడా ఈ సినిమా పూర్తిగా సఫలం కాలేకపోయింది. నిజానికి ఇది కథగా చెప్పుకోవడానికి అద్భుతమైన ఆలోచన. కానీ, దాన్ని తెరపైకి తీసుకొచ్చే విషయంలో టీమ్ పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయింది. సినిమా మొదలైన 10 నిమిషాల తర్వాత, సీరియల్ దెయ్యాలు ఎంటర్ అయినప్పటి నుంచి కథ భలే రాసుకున్నారే అనిపిస్తుంది. మధ్యలో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఆసక్తికరంగా ఉంది. కానీ, సెకండ్ హాఫ్ ఇబ్బంది పెడుతుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపిస్తే, సెకండ్ హాఫ్‌లో మాత్రం సాగదీత ఫీలింగ్ కలుగుతుంది. సినిమా స్టార్ట్ అయినప్పుడు హారర్-కామెడీ బాగుందనిపిస్తుంది. కానీ, సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి అది బోర్ కొట్టేస్తుంది. దర్శకుడు ఎంచుకున్న లైన్ చాలా మంచిది. పేపర్‌పై రాసుకుంటే అద్భుతమైన కథ ఇది. కానీ, తెలుగు ప్రేక్షకులను మెప్పించేలా స్క్రీన్‌పైకి తీసుకొచ్చే విషయంలో పూర్తిగా తడబడ్డాడు. అలా అని పూర్తిగా నవ్వించలేకపోయిందని చెప్పలేం. కొన్ని సీన్స్‌లో ఆర్గానిక్ కామెడీ వర్కవుట్ అయింది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా, సెకండ్ హాఫ్, ప్రీ-క్లైమాక్స్ వరకు పెద్దగా ఆకట్టుకునేలా లేదు. ఒకరకంగా దర్శకుడు గాడి తప్పిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది ఎంతమాత్రం కొత్త కథ కాదు. పెద్దగా ట్విస్టులు ఊహించడం కష్టం కాదు. ఉన్న ఒక్క ట్విస్ట్‌తో ప్రేక్షకులు థ్రిల్ అవ్వడం ఖాయం. సినిమాలోని హారర్‌తో భయపడటం, కామెడీతో నవ్వుకోవడం ఓకే. కానీ, వీటిని మించిన హారర్, కామెడీ సీన్స్ మనవాళ్లు ఎప్పుడో చూశారు. సమంత నిర్మాత రాజ్ డీకే లాంటి దర్శకత్వయంలోని రాజ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత అనగానే ఈ సినిమా కంటెంట్ మీద ప్రేక్షకులలో ఒక రకమైన అంచనా ఉంటుంది. కానీ ఆ అంచనాను అందుకునేలా ఈ సినిమా అయితే లేదు.
నటీనటులు:
ఈ సినిమాలో నటించిన హర్షిత్ రెడ్డికి ఇది దాదాపు మూడో లేదా నాల్గో సినిమా. కానీ, ఫ్రెష్‌గా ఉండటంతో కొత్త కుర్రాడిలా అనిపించాడు. గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించిన చిన్న పాప ఈ సినిమాలో హీరోయిన్‌గా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చింది. ఆమెకు భవిష్యత్తులో మంచి అవకాశాలు దొరుకుతాయనడంలో సందేహం లేదు. శాలిని కొండేపూడితో పాటు నటించిన మరో అమ్మాయి కూడా ఇరగదీసింది. చరణ్ పేరి, గవిరెడ్డి శ్రీను నటన గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలి. వంశీ ఎప్పటిలాగే తనదైన పాత్రలో అలరించాడు. సమంత కొన్ని నిమిషాల పాటు మాత్రమే కనిపించినా, కనిపించిన వెంటనే ప్రేక్షకుల్లో ఒక రకమైన కిక్ కనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే సినిమా బండి టీమ్ కూడా అలరించింది. ముఖ్యంగా రాగ్ మయూర్ టైమింగ్ సినిమాకి బాగా ప్లస్ అయింది.
టెక్నికల్ టీమ్:
టెక్నికల్ టీమ్ విషయంలో పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేదు. నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా సినిమా స్థాయికి సరిపోయాయి. పాటలు పెద్దగా గుర్తుండేలా లేవు. ఒక పాట మాత్రం రీల్ కంటెంట్‌లా వైరల్ అయ్యేలా ఉంది. సమంత నిర్మాతగా సినిమా చేస్తుందనగా పెట్టుకునే అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోవచ్చు. నిర్మాణ విలువలు కూడా అత్యద్భుతం అని చెప్పలేం, సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్‌గా:
ఈ శుభం… అంతా శుభమని చెప్పలేం.
తాజావార్తలు
-
Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
-
Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!