Sahakutumbanam Review: సఃకుటుంబానాం రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: రామ్ కిరణ్, మేఘా ఆకాష్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్, రాజశ్రీ నాయర్ తదితరులు
- DIRECTOR: ఉదయ్ శర్మ
- MUSIC: మణిశర్మ
- PRODUCER: హెచ్. మహదేవ్ గౌడ్, హెచ్. నాగరత్న
ప్రస్తుతం వెండితెరపై మాస్, యాక్షన్ సినిమాల జోరు నడుస్తున్నా కొందరు మాత్రం భిన్నంగా సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో, కుటుంబ విలువల నేపథ్యంలో వచ్చిన సినిమానే ‘సఃకుటుంబానాం’. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడగా ఆ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.
సఃకుటుంబానాం కథ: కళ్యాణ్ (రామ్ కిరణ్) ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను బయట ప్రపంచానికి, సోషల్ మీడియాలో తనది ఒక అద్భుతమైన, అన్యోన్యమైన కుటుంబం అని ఒక రేంజ్ లో ప్రచారం చేసుకుంటుంటాడు. అదే ఆఫీసులో పనిచేసే సిరి (మేఘా ఆకాష్) ఒక అనాథ. కళ్యాణ్ కుటుంబంపై ఉన్న ప్రేమను చూసి ఆమె అతడితో ప్రేమలో పడుతుంది. అయితే, ఈ అందమైన ‘ఫ్యామిలీ బిల్డప్’ వెనుక ఒక చేదు నిజం ఉంటుంది. నిజానికి కళ్యాణ్ ఇంట్లో పరిస్థితులు బయటకు చెప్పేదానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. హీరోకి తన కుటుంబ సభ్యులతో అస్సలు పడదు. అసలు ఆ కుటుంబం మధ్య విబేధాలకు కారణం ఏంటి? కళ్యాణ్ ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది? చివరికి ఆ కుటుంబం అంతా ఎలా కలిసింది? అనేదే ఈ సినిమా కథ.
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
విశ్లేషణ: దర్శకుడు ఉదయ్ శర్మ నేటి తరం యువత సోషల్ మీడియాలో చూపే ‘ఫేక్’ లైఫ్ స్టైల్‌ను, మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే అసలైన సమస్యలను ముడిపెట్టి ఎత్తి పొడుస్తూ కథ రాసుకున్నారు. ఒక అనాథ అమ్మాయికి కుటుంబం విలువ తెలపడంతో పాటు విడిపోయిన మనసులను కలపడం అనే పాయింట్ బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ హీరో-హీరోయిన్ల మధ్య సాగే లవ్ ట్రాక్, సత్య కామెడీతో సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సెకండాఫ్ మీద ఆసక్తిని పెంచుతుంది. అయితే, సెకండాఫ్ లో కథ కాస్త నెమ్మదించిన ఫీల్ కలుగుతుంది. కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపించినా, బ్రహ్మానందం ఎంట్రీతో కథనం మళ్ళీ ఊపందుకుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి.
నటీనటుల విషయానికి వస్తే తొలి సినిమా అయినప్పటికీ రామ్ కిరణ్ ఎక్కడా తడబడకుండా నటించాడు. డ్యాన్స్‌లు, యాక్షన్ సీన్స్‌లోనూ మెప్పించాడు. కాకపోతే డబ్బింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. సిరి పాత్రలో మేఘా ఆకాష్ చాలా హుందాగా నటించింది. కుటుంబ విలువలను ఆశించే యువతిగా ఆమె నటన సహజంగా ఉంది.
సినిమాకు రాజేంద్ర ప్రసాద్ & బ్రహ్మానందం ప్రధాన బలం. రాజేంద్ర ప్రసాద్ తన అనుభవంతో తండ్రి పాత్రకు ప్రాణం పోయగా, చాలా కాలం తర్వాత బ్రహ్మానందం పూర్తిస్థాయి వినోదంతో అలరించారు. సత్య, రచ్చ రవి కామెడీ టైమింగ్ బాగుంది.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే మణిశర్మ సంగీతం కొన్ని చోట్ల అద్భుతంగా ఉంది, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆయన బిజిఎం ప్లస్ అయ్యింది. మధు దాసరి సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉండి, ఫ్యామిలీ డ్రామాకు తగిన ఫీల్ ఇచ్చింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడు ఉదయ్ శర్మ కథనంపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి, కొన్ని స్లో సీన్స్‌ను తగ్గించి ఉంటే అవుట్‌పుట్ మరింత షార్ప్‌గా ఉండేది.
ఫైనల్లీ ‘సఃకుటుంబానాం’ రొటీన్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
తాజావార్తలు
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!