NTV Telugu Site icon

Saakini Daakini Review: ‘శాకిని డాకిని’ మూవీ రివ్యూ

Saakini Daakini Movie Review

Saakini Daakini Movie Review

నివేదా థామస్‌, రెజీనా ప్రధాన పాత్రల్లో సుధీర్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘శాకిని డాకిని’. వీరిద్దరికి మార్కెట్ అంతగా లేదు. దర్శకుడు సుధీర్ వర్మకు సైతం తొలి చిత్రం ‘స్వామిరారా’ తర్వాత చేసిన ఏ సినిమా ఆడలేదు. వీరి కలయికలో వచ్చిన ‘శాకిని డాకిని’ ఆడియన్స్ ముందుకు వచ్చింది. కొరియన్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘మిడ్ నైట్ రన్నర్స్’ ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ విషయానికి వస్తే శాలిని (నివేతా థామస్), దామిని (రెజీనా) పోలీస్‌ ట్రైనింగ్ కోసం పోలీస్ అకాడమీలో చేరారు. వీరిద్దరి మధ్య ఇగో తలెత్తుతుంది. దాంతో ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ ఆపై మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఓ రోజు రాత్రి ఔటింగ్‌ కి వెళతారు. అక్కడ అనుకోకుండా ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడం చూస్తారు. తనని సేవ్ చేయడానికి వారు ఏం చేశారు? ఆ కిడ్నాప్‌ వెనుక ఉందెవరు? తనని కాపాడగలిగారా? లేదా? అన్నదే మిగిలిన కథ.

కొరియన్ సినిమాలో మెయిన్ థీమ్ తీసుకుని తెలుగు నేటివిటికి తగినట్లు మార్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు సుధీర్ వర్మ. ఆ ప్రయత్నంలో కొంత వరకు మాత్రమే సఫలీకృతుడు అయ్యాడు. నివేదా, రెజీనా వంటి ఇద్దరు ఎక్స్ ప్రేషన్స్ ను చక్కగా పలికించగలిగే నటీమణులను పెట్టుకుని కూడా కరెక్ట్ గా డీల్ చేయలేక పోయాడు సుధీర్ వర్మ. పాత్రల పరిచయం పేరుతో తొలి అర్ధబాగం స్లోగా బోరింగ్ గా సాగింది. కిడ్నాప్ చుట్టూ తిరిగే కథలో ఎలాంటి మలుపులు లేకుండా ఒకే పంథాలో వెళ్ళడంతో ఆడియన్స్ సినిమాలో ఇన్ వాల్వ్ కాలేకపోతారు. తొలి భాగమే బోర్ అనుకుంటే ద్వితీయార్ధం అంతకు మించి అనేలా సాగింది. సుధీర్ వర్మ దర్శకత్వం తాలూకు మెరుపులు ఎక్కడా కనిపించలేదు. మ్యూజిక్ గురించి ఎంత తక్కు చెప్పుకుంటే అంత మంచిది. కెమెరా వర్క్ మాత్రం బాగుంది. అలాగే నిర్మాణ విలువలు కూడా ఓకె.

అసలు ఈ సినిమాకు ‘శాకిని డాకిని’ అనే పేరు ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. కిడ్నాప్ కథాంశం కాబట్టి చక్కటి టెంపోతో తీసినా ఫలితం దక్కేది. ‘స్వామిరారా’ తీసిన దర్శకుడే ఈ సినిమాకు డైరెక్టర్ అంటే అసలు నమ్మబుద్ది కాదు. సురేశ్ బాబు లాంటి నిర్మాత నుంచి ఇలాంటి సినిమాను ఎవరూ ఊహించరు. తన బ్యానర్ నుంచి స్టార్స్ సినిమాలు రాకున్నా వెరైటీ ఉన్న చిత్రాలు వస్తాయని ఫీలయ్యే వారి ఆశలను వమ్ము చేసే చిత్రం ‘శాకిని డాకిని’.

ప్లస్ పాయింట్స్:
‘మిడ్ నైట్ రన్నర్స్’ ఆధారం కావటం
నివేదా, రెజీనా నటించటం
సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి రావటం

మైనస్ పాయింట్స్:
స్లో నెరేషన్
ఆకట్టుకోని కథనం
మ్యూజిక్
డైరెక్షన్

రేటింగ్: 1.75/5

ట్యాగ్ లైన్: వామ్మో ‘శాకిని డాకిని’