Prince Movie Review: ప్రిన్స్ (తమిళ డబ్బింగ్)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Sivakarthikeyan, Maria Ryaboshapka, Satyaraj
- DIRECTOR: Anudeep KV
- MUSIC: SS Thaman
- PRODUCER: Sunil Narang, Puskar Rammohan, Suresh Babu
Prince Movie Review: ‘జాతిరత్నాలు’తో చక్కని గుర్తింపు పొందిన దర్శకుడు అనుదీప్ డైరెక్ట్ చేసిన సినిమా ‘ప్రిన్స్’. దీంతో అతను కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి స్టార్ హీరో శివ కార్తికేయన్ తో అనుదీప్ దీన్ని తెరక్కించాడు. విశేషం ఏమంటే ఈ మూవీని తెలుగు నిర్మాతలైన సునీల్ నారంగ్, పుస్కర్ రామ్మోహన్, సురేశ్ బాబు నిర్మించారు. మరి ‘డాక్టర్’, ‘డాన్’తో ఇప్పటికే రెండు హిట్స్ ను బ్యాక్ టూ బ్యాక్ తన ఖాతాలో వేసుకున్న శివ కార్తికేయన్ కు ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో తెలుసుకుందాం..
కృష్ణాజిల్లా దేవరకోటకు చెందిన ఆనంద్ ఓ స్కూల్ లో సోషల్ టీచర్ గా వర్క్ చేస్తుంటాడు. అతని తండ్రి విశ్వనాథం ఊరంతటికీ పెద్దమనిషి. కులమతాలకు అతీతంగా మనుషులు మెలగాలని హితబోధ చేస్తుంటాడు. తన కూతురు.. చెల్లెలి కొడుకును చేసుకుందని ఆమెతో సంబంధాలు కూడా తెగతెంపులు చేసుకుంటాడు. అలాంటి వ్యక్తి కొడుకైన ఆనంద్ తన స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ అయిన బ్రిటీష్ యువతి జెస్సికాను ప్రేమిస్తాడు. కులమతాల బేధం లేని విశ్వనాథం ఈ పెళ్ళికి మాత్రం ససేమిరా అంటాడు. అంతేకాదు.. ఊరి జనం కూడా ఆనంద్ ను వెలివేయడానికి సిద్ధపడతారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఆనంద్ ఏం చేసి.. తన తండ్రిని, ఊరి జనాన్ని మెప్పించాడు? అసలు ఊరు జనం ఎప్పుడో మన దేశం వదిలి వెళ్లిపోయిన బ్రిటీషర్స్ పై ఇప్పుడెందుకు కక్ష పెంచుకున్నారు? ఈ మొత్తం వ్యవహారంలో భూపతి తన స్వార్థం కోసం విశ్వనాథంను ఎలా పావుగా వాడుకున్నాడు? అనేదే సినిమా కథ.
Also Read
- Tharun Bhascker: డ్యూటీ ఎక్కుతున్నా.. దిగే ప్రసక్తే లేదు! ఇకపై తన రూట్ మారుస్తున్నట్లు ప్రకటించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్!
- Vishwak Sen: పాతాళంలోకి వెళ్లిపోతున్న నన్ను కాలర్ పట్టుకుని పైకి లాగింది తరుణ్ భాస్కరే.. విశ్వక్ ఎమోషనల్ స్పీచ్!
- Abhinav Gomatam: నెలకి 30 వేల జాబ్ వదిలేసి ఏడాదికి 30 వేలే సంపాదించా.. అన్నీ అవమానాలే
- Naga Chaitanya: నా మౌనాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు
అనుదీప్ తెరకెక్కించిన ‘జాతిరత్నాలు’ మూవీ ఘన విజయం సాధించడంలో అందరూ అతని దర్శకత్వ ప్రతిభకు ఫిదా అయిపోయారు. బట్… ఆ తర్వాత అతను కథను అందించిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మూవీ అట్లర్ ఫ్లాప్ కావడంతో, అందురిలో అనుమాన బీజం మొలకెత్తింది. ‘ప్రిన్స్’ పరిస్థితి ఎలా ఉంటుందో అని సందేహ పడ్డారు. కామెడీ సినిమాలకు తమిళనాట కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శివ కార్తికేయన్ కు, అనుదీప్ సరైనా జోడీ అని భావించినా.. ఎక్కడో ఏదో సందేహం సినీ జనాల్లోనూ ఉంది. అయితే.. ఓ చిన్న పాయింట్ ను తీసుకుని, తనదైన కామెడీ టచ్ తో అనుదీప్ గట్టెక్కేశాడు. బ్రిటీష్ వనితను ప్రేమించడం అనేది యాదృచ్ఛికంగా జరిగినా, ఊరి జనం అతని మీద ద్వేషం పెంచుకోవడానికి మంచి రీజన్స్ ను అనుదీప్ తయారు చేశాడు. కానీ ఇంతా చేసి క్లయిమాక్స్ లో కాలెత్తేశాడు! దేశభక్తి ప్రధానమా? హ్యుమానిటీ ప్రధానమా? అనే అంశాన్ని లేవనెత్తి.. దేశభక్తిలో హ్యుమానిటీ లేదనే భావన తీసుకొచ్చాడు. పోనీ ఆ హ్యుమానిటీని అయినా అర్థం చేసుకుని జనం అతని ప్రేమకు ఆమోద ముద్ర వేశారా అంటే అదీ లేదు! థియేటర్లో కాసేపు నవ్వుకోవడానికి తప్పితే, ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.
శివ కార్తికేయన్.. సోషల్ టీచర్ ఆనంద్ గా చలాకీగానే నటించాడు. కానీ సోషల్ టీచర్ కు ఉండాల్సిన కనీస లక్షణాలను కూడా ఆ పాత్రకు ఆపాదించలేదు. సహజంగా మన సినిమాల్లో హీరో పక్కన కమెడియన్ ఉంటాడు.. కానీ ఇందులో హీరోనే కమెడియన్! అలానే విశ్వనాథం పాత్ర పోషించిన సత్యరాజ్ దీ అదే పరిస్థితి. అతని క్యారెక్టరైజేషన్ కూడా కామెడీనే సాగుతుంది. మనిషిలో విషయం లేకపోయినా గుర్తింపు కోసం తాపత్రయ పడిపోతుంటుందా పాత్ర. ఇందులో కాస్తంత సీరియస్ పాత్ర ఏదైనా ఉందంటే అది హీరోయిన్ జెస్సికా పాత్రే. గంగై అమరన్ కుమారుడు ప్రేమ్ జీ విలన్ కాని విలన్ గా కనిపిస్తాడు. మిగిలిన పాత్రల్లో అత్యధికులు తమిళులే! కామెడీ సీన్స్ రాసుకుని, సినిమాను నడిపేశారు తప్పితే, ఎక్కడ లాజిక్ అనేది కనిపించదు. థమన్ సాంగ్స్ ఏవీ ఆకట్టుకునేలా లేవు. దాంతో రామజోగయ్య శాస్త్రి సాహిత్యమూ పెద్దంత గొప్పగా అనిపించలేదు. అయితే.. భీమ్ శ్రీనివాస్ రాసిన డైలాగ్స్ బాగా పేలాయి. ‘జాతిరత్నాలు’ను ఊహించుకుని థియేటర్ కు వెళితే నిరాశకు గురికాక తప్పదు. బట్.. టైమ్ పాస్ కేటగిరిలో ‘ప్రిన్స్’ను వేయొచ్చు!
ప్లస్ పాయింట్స్
కామెడీ ఎంటర్ టైనర్
భీమ్ శ్రీనివాస్ డైలాగ్స్
మూవీ రన్ టైమ్
మైనెస్ పాయింట్స్
బలహీనమైన కథ
ఆకట్టుకోని కథనం
పూర్ క్లయిమాక్స్
రేటింగ్: 2.5/ 5
ట్యాగ్ లైన్: ఓన్లీ ఎంటర్ టైన్ మెంట్!
తాజావార్తలు
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
-
OTR: మానుకోట కాంగ్రెస్లో ముసలం.. చైర్పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు..!
-
OTR : కృష్ణా జలాల రచ్చ: తాత్కాలిక ఒప్పందం.. శాశ్వత వివాదం, తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!